హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Capital Issue: అమరావతికి 2024 వరకు టైమ్.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్..

AP Capital Issue: అమరావతికి 2024 వరకు టైమ్.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Capital Amaravati) పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు (AP High Court) లో కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు గడువు ముగుస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Capital Amaravati) పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు (AP High Court) లో కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని పిటిషన్లపై తీర్పు సందర్భంగా ఈ నెల 3వ తేదీలోగా సీఆర్డీఏ రైతులకుఇచ్చిన ప్లాట్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. గడువు పూర్తవడంతో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ఏపీ సర్కార్ పేర్కొంది. సీఆర్డీఏ చట్టంలో పనులు పూర్తి చేసేందుకు మరో నాలుగేళ్ల సమయం పొడిగించామని.. ఈ నిర్ణయంతో 2024 జనవరి వరకు సమయం ఉందని ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుకదగకతరపబపత్వం రూ.42 వేల కోట్ల పనులను గ్రౌండ్ చేసిందన్న ప్రభుత్వం.. పనులు చేసేందుకు నిధుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.

  గత ప్రభుత్వం బ్యాంక్‍లు, ఆర్థికసంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చిందని.. వాటికి వడ్డీ చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. అలాగే పనులు చేసిన కాంట్రాక్టర్లను పిలిపించి మాట్లాడామని.. వారికి బిల్లులు చెల్లించాలన్న నిధుల కొరత ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రభుత్వానికి ప్రధమ ప్రాధాన్యతగా ఉందని స్పష్టం చేసింది. ఇక గత ప్రభుత్వం రాజధాని పరిధిలో ఎకరం ధర రూ.4 కోట్లుగా నిర్ణయించిందని.., 2023 నాటికి రాజధాని అభివృద్ధి తర్వాత భూములు అమ్మాలని ఉత్తర్వుల్లో ఉన్నట్లు పేర్కొంది.

  ఇది చదవండి: ఏపీలో ఆలయాలపై మళ్లీ మొదలైన రగడ.. బీజేపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు

  ఇక రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు 22,276 ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉందని.. వాటిలో 17,357 ప్లాట్లు రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి అమ్మకాలు జరగడంతో కేసులు నమోదు 1,598 ప్లాట్లపై కేసులు నమోదవగా.. వాటిపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించింది.

  ఇది చదవండి: కాబోయే ప్రధాని వైఎస్ జగన్.. ఏపీ మంత్రి సంచలన కామెంట్స్..

  ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం.. తీర్పుపై అప్పీల్‍కు వెళ్లాలా? లేదా? అనే అంశంపై న్యాయ సలహా తీసుకుటోంది. ఇటీవల అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సీఎం జగన్ తో పాటు మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులే తమ విధానమని.. అదే సరైన నిర్ణయమని.. పాలనా వికేంద్రీకరణ వల్లే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు.

  ఇది చదవండి: మరో బాదుడికి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.. మరో మూడేళ్లు ఛార్జీల మోతే..

  అలాగే హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరిస్తోందన్న అభిప్రాయం కూడా సభలో వ్యక్తమైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని హైకోర్టు ఆదేశించడం సరికాదన్న జగన్.. తీర్పుపై న్యాయ సలహా తీసుకొని ప్రభుత్వ విధానం ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశించిన గడువు ముంచుకురావడంతో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుంది.. న్యాయసలహా తర్వాత ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  ఉత్తమ కథలు