ఆర్టీసీ కార్మికులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక అందించింది. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసును 60ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులకు పదవీ విరమణ వయసు 58 ఏళ్లుగా ఉంది. దాన్ని మరో రెండేళ్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం జీవో జారీచేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Apsrtc, Rtc