Home /News /andhra-pradesh /

AP GOVERNMENT EMPLOYEES GAVE NOTICE TO CM SAMEER SHARMA OVER PRC FIGHT FULL DETAILS HERE PRN GNT

AP Govt Employees: పీఆర్సీపై ఇక యుద్ధమే.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసులు..

సీఎస్ కు నోటీసులిస్తున్న ఉద్యోగ సంఘాలు

సీఎస్ కు నోటీసులిస్తున్న ఉద్యోగ సంఘాలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వంపై (AP Government) ఉద్యోగులు యుద్ధం ప్రకటించారు. చాన్నాళ్లుగా పీఆర్సీ నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు.. పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఐతే ఇంతవరకు సానుకూల ప్రకటన రాకపోవడంతో ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వంపై (AP Government) ఉద్యోగులు యుద్ధం ప్రకటించారు. చాన్నాళ్లుగా పీఆర్సీ నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు.. పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఐతే ఇంతవరకు సానుకూల ప్రకటన రాకపోవడంతో ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి నోటీసులు అందించారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సీఎస్ కు ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చినట్లు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. నెలరోజులుగా ప్రభుత్వ పెద్దలతో చుట్టు తిరిగి అలసిపోయామన్న ఆయన.., మాకు ఇవ్వాల్సి పిఆర్సీ ,డీఏలు వంటి 45 డిమాండ్స్ ఇవ్వాలని వేడుకున్నామని తెలిపారు. ప్రభుత్వ పెద్దల మాటలు మూటలుగానే అయ్యాయే తప్పా అమలు కాలేదని ఆయన విమర్శించారు.

    తాము ప్రకటించిన కార్యాచరణ యధావిధంగా అమలు చేస్తామని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నెల 7 నుండి మా ఉద్యమం ప్రారంభం అవుతుందన్న ఆయన.. అదే రోజు నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి భోజన విరామ సమయంలో నిరసనలు తెలుపుతామని ప్రకటించారు. ఇది కేవలం ప్రభుత్వ తప్పిదమేనని.., పిఆర్సీ నివేదిక ఇప్పటికీ ఇవ్వలేదని ఆరోపించారు. ఉద్యోగులకు 55శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆలాగే తాము దాచుకున్న రూ.1600కోట్లు ఇవ్వమని ఆడిగినా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

    ఇది చదవండి: కొడాలి నాని, వంశీని భౌతికంగా తొలగిస్తే రూ.50 లక్షలు..! కమ్మ వనసమారాధనలో షాకింగ్ కామెంట్స్..



    ప్రభుత్వానికి ఐదు పేజీల ఉద్యమ కార్యాచరణను అందజేసినట్లు అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నవంబర్ నెలాఖరుకు అన్ని సమస్యలు పరిష్కారిస్తామని సజ్జలతో పాటు మిగతా ప్రభుత్వ పెద్దలు చెప్పారని.., కానీ ఏవీ అమలు కాలేదన్నారు. మూడేళ్ళుగా ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించామని.., కరోన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు ఉద్యోగులుగా సహకరించి సంగతి బొప్పరాజు గుర్తుచేశారు.

    ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనం వాయిదా వేసుకోవాలన్న టీటీడీ.. కారణం ఇదే..!


    కరోన సమయంలో మా జీతాల్లో కోత విధించిన సమయంలో కూడా చిత్తశద్ధితో పనిచేశామన్నారు. కారుణ్య నియామకాల అంశంలో ప్రభుత్వం మాట తప్పిందని.., ఇప్పుడు ఉద్యోగులు రోడ్డు మీదకు రావడానికి పూర్తిగా ప్రభుత్వమే కారణంమని ఆరోపించారు. పీఆర్సీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించిన ఆయన.., పీఆర్సీ నివేదికలో ఏమైనా లొసుగులు ఉన్నాయా..? అనే అనుమానం కలుగుతుందన్నారు.

    ఇది చదవండి: ఏపీలో వారందరికీ పెన్షన్లు కట్..? ఈ ఒక్కలేఖతో చిక్కుల్లో జగన్ సర్కార్..!


    బుగ్గన వ్యాఖ్యలు సరికాదు
    ఉద్యోగులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బొప్పరాజు తెలిపారు. జీతాల గురించి,ఉద్యోగులను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి,ఉద్యోగుల మద్య దూరం పెంచేలా ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులంతా సంఘటితం కావాలని., ఇందుకోసం రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రాంతీయ సభలు పెట్టబోతున్నామమన్నారు. పోరాటం ద్వారా ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ఉద్యోగులు సమస్యలపై స్పందిస్తారని ఎదురుచూస్తున్నామని బొప్పరాజు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Employees

    తదుపరి వార్తలు