AP GOVERNMENT EMPLOYEES ASSOCIATIONS REACTED ON GPF ACCOUNTS ISSUE FULL DETAILS HERE PRN
AP News: ఉద్యోగుల జీపీఎఫ్ మాయం వెనుక కారణం ఇదే..! ఉద్యోగ సంఘాల నేతలు ఏం చెప్పారంటే..!
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) ఖాతాల్లో జీపీఎఫ్ నగదు మాయమవడంపై గందరగోళం కొనసాగుతోంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులను కలిసి ఖాతాల వ్యవహారంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) ఖాతాల్లో జీపీఎఫ్ నగదు మాయమవడంపై గందరగోళం కొనసాగుతోంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులను కలిసి ఖాతాల వ్యవహారంపై చర్చించారు. బుధవారం ఉదయం ఒకసారి, సాయంత్రం మరోసారి ఏఫీ జీఏసీ, ఏపీ జేఏసీ నాయకులు ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ను కలిసి వివరాలు అడిగారు. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. ఐతే ఖాతాల్లోని నగదు ఎలా మాయమైందో తమకు తెలియదని.. విచారణ జరిపిస్తామని అధికారులు వెల్లడించారు. దీనిపై కిందిస్థాయి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుంటామన్నారు.
జిపిఎఫ్ లో డబ్బులు మాయంపై ఉద్యోగులలో ఆందోళన నెలకొనిందని ఏపీ జఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. ట్రెజరీ , సిఎఫెఎంఎస్ ద్వారా బిల్లులు పాస్ చేసే విధానంలో జరిగిన పొరపాటు వల్ల సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. దీనిపై వీలైనంత త్వరగా రిపోర్టులు వస్తాయని ఆర్థికశాఖ అధికారులు రావత్, సత్యనారాయణ తెలిపారన్నారు.
2018 జూలై 1 నుంచి రావలసిన డిఏ బకాయిలు కొందరికి క్రెడిట్, డిబేట్ కావడం ప్రభుత్వ తప్పిదం కాదని అధికారులు వివరించినట్లు శ్రీనివాస్ చెప్పారు. సాంకేతికంగా ఏం జరిగింది అనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. జూలై నెలాఖరులోపు జిపిఎఫ్, మొత్తం డిఏ బకాయిలు చెల్లిస్తామని ఆర్థికశాఖ అధికారులు హామీ ఇచ్చారని.., ఏ ఉద్యోగికి అన్యాయం జరిగినా ఓర్చుకోమని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు.
జిపిఎఫ్ ఖాతాల్లో క్రెడిట్, డెబిట్ స్లిప్ లు డౌన్ లోడ్ చేసుకొనేందుకు నిన్నటి నుంచే ఓపన్ చేసినందున ఇది బయటపడిందని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. దీనిపై ఏజీ కార్యాలయంలోనూ చర్చించామని.. ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం ఇలా చేయలేదని ఫైనాన్స్ అధికారులు వివరించారని చెప్పారు.
సాంకేతిక సమస్య కారణంగా 68 వేల మందికి ఇబ్బందులొచచ్యని.., డిఏ అరియర్స్ విడతల వారిగా ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడిందన్నారు. సిపిఎస్, ఓపిఎస్ ఉద్యోగుల బిల్లులు ఒకేసారి చేసినందున ఈ సమస్య వచ్చిందన్నారు. సమస్యను వెంటనే సరిచేసి మళ్లీ ఇబ్బందులు రాకుండా చూస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు బొప్పరాజు చెప్పారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం కావాలనే ఉద్యోగుల జీపీఎఫ్ తో గేమ్స్ ఆడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ను జగన్ ప్రావిడెంట్ ఫండ్ గా మార్చుకున్నారని టీడీపీ నేత అశోక్ బాబు విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తోందని.. రూ.800 కోట్ల డీఏ బకాయిల మాయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.