Home /News /andhra-pradesh /

AP GOVERNMENT DESIGNED YSR APP FOR FARMERS AK

ఏపీలో రైతుల కోసం వైఎస్ఆర్ యాప్.. ఎలా పని చేస్తుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

YSR app: రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వైయస్ఆర్ యాప్ పేరుతో ఒక మొబైల్ యాప్ ను రూపొందించింది.

    రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వైయస్ఆర్ యాప్ పేరుతో ఒక మొబైల్ యాప్ ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసా కేంద్రాల సిబ్బంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వపరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతుభరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం, సదరు పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం, కొత్తగా ప్రజల కోసం రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా రియల్ టైంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడింది.

    రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులు వేసే పంటలను ఈక్రాప్ కింద నమోదు చేయడం, పొలంబడి కార్యక్రమాలు, సిసి ఎక్స్‌పెరిమెంట్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణ, పంటలబీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్దం చేయడం, రైతులకు ఇన్‌పుట్స్ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఈ యాప్ లో ఆర్‌బికే సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీనిని ఉన్నతస్థాయిలోని అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.

    రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్‌బికేల్లో డిజిటల్ రిజిస్టర్ ను నిర్వహించడం, ఆర్‌బికే ఆస్తులను పరిరక్షించడం, ఎక్కడైనా పరికరాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సకాలంలో రిపోర్ట్ చేయడం, డాష్‌బోర్డ్ లో ఆర్‌బికే కార్యక్రమాలను పర్యవేక్షించడం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించడం, వివిధ పథకాలకు సంబంధించి సర్వే చేయడం, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ లను తీసుకోవడం కూడా ఈ యాప్ ద్వారా సాధ్యపడుతుంది.

    ఆర్‌బికె పెర్ఫార్మ్‌న్స్ డాష్‌బోర్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్‌బికేల పనితీరును పరిశీలించడం, సరిపోల్చడం, మెరుగైన పనితీరు కోసం ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశానిర్ధేశం చేసేందుకు వీలుగా దీనిని రూపొందించారు. రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి అవసరాలను తీర్చడం, వారికి మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాచారం పొందేలా ఈ యాప్‌ రూపకల్పన చేశారు.




    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysr rythu bharosa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు