ఏపీలో కొత్తగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్...

ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.

news18-telugu
Updated: December 20, 2019, 3:38 PM IST
ఏపీలో కొత్తగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పంట భీమా సక్రమంగా అమలు చేసేందుకు రైతుల సౌకర్యం కోసం ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. వంద శాతం ప్రభుత్వ సంస్థగా రాష్ట్ర సాధారణ భీమా సంస్థ అవతరించనుంది. వ్యవసాయ ఉత్పత్తులకు భీమా కల్పించటమే లక్ష్యంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఏర్పడనుంది. 101 కోట్ల రూపాయల వాటాధనంతో భీమా సంస్థను ప్రారంభిస్తున్నట్టుగా ఐఆర్‌డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసంది. విజయవాడ కేంద్రంగా ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ పని చేయనుంది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్‌లు కార్పోరేషన్‌కు డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు.
First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు