ఏపీ రైతులకు మరో గుడ్ న్యూస్

ఏపీ రైతులకు మరో గుడ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్... రైతులకు ఉచితంగా బోర్లు వేయించేందుకు సిద్ధమవుతోంది.

  • Share this:
    రైతులకు మేలు చేసేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్... రైతులకు ఉచితంగా బోర్లు వేయించేందుకు సిద్ధమవుతోంది. భూగర్భ జలాల ద్వారా సాగును పెంచే యోచనలో ఉన్న ఏపీ ప్రభుత్వం... ఇందుకోసం స్వయంగా రిగ్గులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటి కోసం టెండర్లు పిలిచేందుకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం మొదటి విడతగా 200 రిగ్గులు సమకూర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

    తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వం రిగ్గుల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.
    First published: