హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో ఆలయాలపై దాడుల మీద విచారణకు 16 మందితో సిట్ ఏర్పాటు

ఏపీలో ఆలయాలపై దాడుల మీద విచారణకు 16 మందితో సిట్ ఏర్పాటు

కృష్ణాజిల్లా ఉయ్యూరు శివలయం (ఫైల్)

కృష్ణాజిల్లా ఉయ్యూరు శివలయం (ఫైల్)

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల మీద జరుగుతున్న దాడులను విచారించేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు ఐపీఎస్ జీవీ అశోక్ కుమార్ నేతృత్వం వహిస్తారు. రాష్ట్రంలో 2020 సెప్టెంబర్ నుంచి పలు ఆలయాల్లో జరిగిన దాడుల మీద సమగ్రంగా విచారణ జరపనుంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల మీద జరుగుతున్న దాడులను విచారించేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు ఐపీఎస్ జీవీ అశోక్ కుమార్ నేతృత్వం వహిస్తారు. రాష్ట్రంలో 2020 సెప్టెంబర్ నుంచి పలు ఆలయాల్లో జరిగిన దాడుల మీద సమగ్రంగా విచారణ జరపనుంది. వీటికి సంబంధించిన విచారణలో భాగంగా అవసరమైతే సహకరించాలంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు కూడా ప్రభుత్వం ఆదేశించింది. అలాగే, ఈ కేసులో సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. సిట్ కూడా ఆయా జిల్లాల ఎస్పీలు, స్థానిక పోలీసులు అందరితోనూ సయోధ్య చేసుకుంటూ కేసును విచారణ జరపనుంది. దాడులు జరిగిన తీరు, ఇలాంటివి గతంలో ఎక్కడైనా జరిగాయా? ఎవరు చేసి ఉంటారనే అంశాలను వారు పరిశీలించనున్నారు. ఇక సిట్‌‌కు సీఐడీలోని సైబర్ క్రైమ్ విభాగం కూడా సహకరించనుంది. ఈ కేసు విచారణలో అవసరం అయితే డీజీపీతో నేరుగా మాట్లాడి మరింత మంది పోలీసులను టీమ్‌లోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆలయాల మీద దాడులకు సంబంధించి కోర్టుకు సమగ్ర నివేదిక అందించనుంది. అలాగే, ఎప్పటికప్పుడు కేసు విచారణ సమాచారాన్ని డీజీపీకి కూడా తెలియజేయాలి.

  ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం చేపట్టినట్టు కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో గత ప్రభుత్వ హయాంలో తొలగించిన దేవాలయాల పునర్నిర్మాణానికి ఏపీ సీఎం జగన్ ఈ రోజు శ్రీకారం చుట్టారు. విజయవాడలో పై వంతెన నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో తొలగించిన దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఏపీలో తాజాగా చోటు చేసుకున్న ఆలయాల విధ్వంసం, విగ్రహాల ధ్వంసం ఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తిరిగి భక్తుల్లో విశ్వాసం నింపడంతో పాటు విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

  కనుమ రోజు ఆలయాల్లో గోపూజ

  సంక్రాంతి పర్వదినం సందర్భంగా కనుమ నాడు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో గోపూజ నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 15న కనుమ పండుగ రోజు ఈ వేడుక నిర్వహించనున్నారు. ‘గోవు సమస్త దేవతాస్వరూపం. గోమాతను పూజించడం రుషులకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. గోవుల యందు సకల దేవతలు, తీర్థాలు కొలువై ఉన్నాయని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. గోవుకు సమానమైనది లేదు. గోపూజ చేయడం వలన, గో సంరక్షణ చేయడం వలన పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పురాణోక్తి. గోపూజ జరపడం వలన మానవాళిని పీడిస్తున్న సమస్త దోషాలు తొలగి, శ్రేయస్సు కలుగుతుంది. గోమాతల రక్షణ సర్వమాణవాళి రక్షణ కాగలదు.’ అని దేవాదాయ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, AP Temple Vandalism

  ఉత్తమ కథలు