హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కేసీఆర్ ‌ఒప్పుకున్నారు.. వాటికి సాక్ష్యాలు సిద్ధం చేస్తున్న ఏపీ సర్కార్

కేసీఆర్ ‌ఒప్పుకున్నారు.. వాటికి సాక్ష్యాలు సిద్ధం చేస్తున్న ఏపీ సర్కార్

కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటోలు)

కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటోలు)

Krishna River Water Dispute News: అపెక్స్ భేటీలో తెలంగాణ సీఎస్ కేసీఆర్ అంగీకరించినట్టు మినిట్స్ ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. న్యాయస్థానాల్లోనూ, అపెక్స్ కౌన్సిల్‌లోనూ ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

    Krishna River Water Dispute: రాయలసీమ ప్రాజెక్టులపై తెలంగాణకు కౌంటర్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గతంలో తెలంగాణ సర్కార్ ఒప్పుకున్న అంశాలపై ఆధారాలను ఏపీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అపెక్స్ భేటీలో తెలంగాణ సీఎస్ కేసీఆర్ అంగీకరించినట్టు మినిట్స్ ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. న్యాయస్థానాల్లోనూ, అపెక్స్ కౌన్సిల్‌లోనూ ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 2015లో జరిగిన కృష్ణా రివర్ బోర్డు మేనేజ్’మెంట్ సమావేశానికి సంబంధించిన కీలక అంశాలను ఏపీ సాగునీటి పారుదల శాఖ సిద్ధం చేస్తోంది. మరోవైపు కృష్ణా జలాలపై రాజీపడొద్దని అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

    ఏపీపై కృష్ణా రివర్ బోర్డు వివక్ష చూపుతుందనే భావనలో ఏపీ సర్కార్ ఉంది. తమను పట్టించుకోని బోర్డు తెలంగాణపై సానుభూతి చూపుతుందని భావిస్తోంది. విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ నీళ్లు వాడుకుంటున్నా.. బోర్డు వివక్షతో చూపుతుందని భావిస్తోంది. విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయాలని కోరినా బోర్డు పట్టించుకోలేదని.. పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 0.517 టీఎంసీలు వాడుకుంట తమను తప్పుబట్టడం సరికాదన్న భావనలో ఏపీ ప్రభుత్వం ఉంది. శ్రీశైలం వరద నీటిని పోతిరెడ్డిపాడుకి 66 టీఎంసీలు కేటాయించాలన్నతమ వినతిని పరిగణనలోకి తీసుకోవాలని కోరేందుకు సిద్ధమవుతోంది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CM KCR, Krishna River Management Board, Telangana

    ఉత్తమ కథలు