హోమ్ /వార్తలు /andhra-pradesh /

AP PRC Issue: పీఆర్సీపై ప్రభుత్వం ముందడుగు.., మంత్రుల పిలుపు.. ట్విస్ట్ ఇచ్చిన ఉద్యోగులు..

AP PRC Issue: పీఆర్సీపై ప్రభుత్వం ముందడుగు.., మంత్రుల పిలుపు.. ట్విస్ట్ ఇచ్చిన ఉద్యోగులు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య నెలకొన్న పీఆర్సీ వివాదం (PRC Issue) కీలక దశకు చేరుకుంది. పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

ఇంకా చదవండి ...

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య నెలకొన్న పీఆర్సీ వివాదం (PRC Issue) కీలక దశకు చేరుకుంది. పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. జీతాల వివాదంపై చర్చించేందుకు రావాల్సిందిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పీఆర్సీ సాధన సమితి నేతలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు చర్చలకు రావాలంటూ మంత్రు బొత్ససత్యనారారయణ, పేర్ని నాని నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు వెళ్లాయి. పీఆర్సీ విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగ సంఘాలన్నీ సమావేశమయ్యాయి. పీఆర్సీ సాధన సమితి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నుంచి నేతలు హాజరయ్యారు.

    పీఆర్సీ జీవోలు రద్దు, ఇతర సమస్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం ప్రభుత్వానికి నోటీసులివ్వాలని సమావేశంలో తీర్మానించారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సీఎస్ కు సమ్మె నోటీసులివ్వాలని పీఆర్సీ సాధన సమితీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓ వైపు సమావేశం జరుగుతుండగానే.. సమ్మెకు వెళ్లొద్దని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామంటూ మంత్రుల నుంచి ఉద్యోగ సంఘాలకు ఫోన్లు వెళ్లాయి. ఐతే పీఆర్సీని వెనక్కి తీసుకున్న తర్వాతే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: అధికార పార్టీని వీడనున్న మహిళా నేత.. ఆ పార్టీవైపుచూస్తున్నారా..? కానీ కండిషన్స్ అప్లై..

    ఉద్యోగుల సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం రవాణా వ్యవస్థను స్తంభింపజేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వంలో విలీనం చేసినా ఆర్టీసీ సిబ్బంది సమస్యలు తీరలేని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇస్తారని భావించామని, ప్రభుత్వ ఉద్యోగుల కంటే 19 శాతం ఐఆర్ తేడాగా ఉందని వెల్లడించారు.

    ఇది చదవండి: వైసీపీకి తప్పని ఇంటిపోరు.. గెలిచిన చోట్లా వర్గ విభేదాలు.. ఇలా ఇయితే కష్టమేనా..?

    ఈ సమ్మెకు ఆర్టీసీ ఉద్యోగులతో పాటు మెడికల్ సిబ్బందిని కూడా సమ్మెలో భాగస్వామ్యం చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి వైద్య శాఖ ఉద్యోగులు కూడా సమ్మతించినట్లు తెలుస్తోంది. కరోనా థర్డ్ వేవ్ సమయంలో వైద్య సిబ్బంది సమ్మెకు దిగితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశముంది. ఇదిలా ఉంటే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ఆర్ధిక శాఖ ట్రెజరీ జారీ చేసిన ఆదేశాలపై ట్రెజరీ, పే అండ్ ఎకౌంట్స్ ఉద్యోగులు స్పందించారు. ఉద్యోగుల పీఆర్సీ బిల్లులు ప్రాసెస్ చేసే ప్రసక్తే లేదని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల అసోసియేషన్ స్పష్టం చేసింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    ఉత్తమ కథలు