హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Breaking: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..

Big Breaking: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవలే సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ (Gautham Sawan) ను డీజీపీ (AP DGP) పదవి నుంచి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవలే సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ (Gautham Sawan) ను డీజీపీ (AP DGP) పదవి నుంచి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. సవాంగ్ ను ఆకస్మికంగా బదిలీ చేసిన సర్కార్.. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్ ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సవాంగ్ ఆకస్మిక బదిలీ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే..!

  ఇటీవల రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అవడం వెనుక పోలీసుల వైఫల్యం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల రాకను అంచనా వేయలేకపోవడం, జిల్లాల్లో వారిని అడ్డులేకపోవడంలో పోలీసులు సరిగా వ్యవహించలేదన్న అసంతృప్తి కూడా ప్రభుత్వం నుంచి వ్యక్తమైంది. బదిలీ నేపథ్యంలో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం కూడా జరుగింది. ఇంతలోనే రాష్ట్రప్రభుత్వం సవాంగ్ ను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  ఇది చదవండి: ఏపీని తాకిన హిజబ్ వివాదం..? విజయవాడ లయోలా కాలేజీలో కలకలం..

  గౌతమ్ సవాంగ్ కెరీర్ ఇలా..

  1986 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన.. తొలుతచిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చిత్తూరు, వరంగల్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001 నుండి 2003 వరకు వరంగల్‌ రేంజి డీఐజీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2003 నుండి 2004 వరకు ఎస్‌ఐబీ డీఐజీగా పనిచేశారు. 2004 నుండి 2005 వరకు ఏపీఎస్పీ బెటాలియన్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై వెళ్ళారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా పనిచేశారు. 2008 నుండి 2009 వరకు లా అండ్ ఆర్డర్ ఐజీగా బాధ్యతలు చేపట్టారు. 2016లో డీజీగా పదోన్నతి అందుకున్న ఆయన.. 2018 వరకు విజయవాడ పోలీస్ కమిషనర్‌ గా పనిచేశారు. 2018 జులై నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా పోస్టింగ్ పొందారు. 2019 ఆగస్టులో ఏపీ డీజీపీగా నియమితులయ్యారు. 2022 ఫిబ్రవరి 15న ఏపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 17న ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించింది.

  First published:

  Tags: Andhra Pradesh, Gautam Sawang

  ఉత్తమ కథలు