ఖరీఫ్ పంట వేసేందుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి గుడ్ న్యూస్ అందించారు. రైతు భరోసా పథకం కింద నిధులను నేటి నుంచి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. నిధులను ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49,43,590 మంది రైతులకు ఈ నిధులు పంపిణీ చేస్తారు. సాధారణ లబ్ధిదారులు 46,28,767 మంది, చనిపోయిన వారి వారసులు 61,555, వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం కాని వారు 2,12,025, దేవాదాయ భూముల రైతులు 623, అటవీ భూములు సాగు చేసుకునే వారు 40,620 మంది లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.7,500 జమ చేయనున్నారు. రూ.2వేల పీఎం కిసాన్ నిధులు గత నెలలోనే రైతుల ఖాతాలో జమ కాగా, మిగిలిన డబ్బును నేడు ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకానికి అదనపు నిధులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది కూడా.
పథకంపై సీఎం జగన్ రైతులకు లేఖ కూడా రాశారు. అందులో ‘రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 వంతున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతు కుటుంబానికి అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పిన దానికంటే మిన్నగా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోంది. ఏటా రూ.13,500 చొప్పున నాలుగేళ్లు కాకుండా ఐదేళ్లలో అక్షరాలా రూ.67,500 అర్హులైన ప్రతి రైతు కుటుంబానికీ రైతు భరోసా అందిస్తోంది. రూ.50 వేలకు బదులు రూ.67,500 ఇస్తోంది. తద్వారా ఐదేళ్లలో రూ.17,500 అధికంగా ఇస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ సొమ్మును బ్యాంకులు పాత బకాయి కింద జమ చేసుకున్నా, తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా రైతన్నలు హెల్ప్‌లైన్ 1902కు ఫోన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.