పెట్రోల్‌, డీజిల్‌పై ఏపీలో రూ. 2 త‌గ్గింపు

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ను రూ. 2 రూపాయ‌ల మేర త‌గ్గిస్తూ ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేశారు. కేంద్రం కూడా ధ‌ర‌లు తగ్గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

news18-telugu
Updated: September 10, 2018, 4:21 PM IST
పెట్రోల్‌, డీజిల్‌పై ఏపీలో రూ. 2 త‌గ్గింపు
ప్రతీకాత్మక చిత్రం(Image: REUTERS)
  • Share this:
ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర ప‌రిధిలో లీట‌ర్ పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 2 వ్యాట్‌ను త‌గ్గించారు. అసెంబ్లీలో ఈ మేర‌కు ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. దేశ‌వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపున‌కు నిర‌స‌న కాంగ్రెస్ స‌హా ప‌లు ఇత‌ర పార్టీలు భార‌త్ బంద్ చేప‌ట్టాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఈ త‌గ్గింపు కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ఏటా రూ. 1120 కోట్ల భారం ప‌డ‌నుంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌నే కార‌ణంగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచ‌డం స‌రికాద‌ని చంద్ర‌బాబు అన్నారు. గ‌తంలో చ‌మురు ధ‌రలు ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలోనూ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఈ స్థాయిలో లేవ‌ని ఆయ‌న గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న నిర‌స‌న‌ల‌ను దృష్టి పెట్టుకుని కేంద్రం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. త‌గ్గిన ధ‌ర‌లు ఏపీలో రేప‌టి నుంచి అమ‌లుకానున్నాయి.

First published: September 10, 2018, 4:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading