హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి అస్వస్థత.. మొహాలీ ఆస్పత్రిలో చేరిక.. పంజాబ్‌లో ఎందుకంటే..

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి అస్వస్థత.. మొహాలీ ఆస్పత్రిలో చేరిక.. పంజాబ్‌లో ఎందుకంటే..

వల్లభనేని వంశీ (పాత ఫొటో)

వల్లభనేని వంశీ (పాత ఫొటో)

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు. పంజాబ్ లోని మొహాలీలో ఓ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రతిష్టాత్మక ఐండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో క్లాసుల కోసం ఆయన అక్కడికి వెళ్లారు. వివరాలివే..

ఆంధ్రప్రదేశ్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi) అస్వస్థతకు గురయ్యారు. పంజాబ్ లోని మొహాలీలో ఓ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. సైకిల్ గుర్తుపై గెలిచి, టీడీపీపై తిరుగుబావుటా ఎగరేసిన వంశీ గత రెండేళ్లుగా అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటం, స్థానికంగా జగన్ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటూ నిత్యం వార్తల్లో నిలవడం తెలిసిందే. వంశీ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందగా, పంజాబ్ లో ఆయన వెంటున్న సన్నిహితులు అసలేం జరిగిందో  సమాచారం అందించారు.

ప్రజాప్రతినిధిగా ఉంటూనే ఉన్నతవిద్యను అభ్యసిస్తోన్న వల్లభనేని వంశీ ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) హైదరాబాద్ లో గతేడాది సీటు సంపాదించారు. అడ్వాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ మూడో సెమిస్టర్ చదువుతోన్న ఆయన కోర్సులో భాగంగా మొహాలీలోని ఐఎస్‌బీ క్యాంపస్ కు వెళ్లారు. సోమవారం నుంచి మొహాలీ ఐఎస్‌బీ క్యాంపస్ లో ఆఫ్ లైన్ తరగతులకు వంశీ హాజరవుతున్నారు. ఈ క్రమంలో, మంగళవారం ఆయన అస్వస్థతకు గురయ్యారు.


Draupadi Murmu : ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం విషాదభరితం.. అన్నీ తట్టుకొని ఎదిగారిలా..


ఐఎస్ బీ క్యాంపస్ లో మంగళవారం తరగతులకు హాజరైన వంశీకి ఎడమచేయితోపాటు ఒంట్లో ఎడమ భాగం విపరీతంగా లాగినట్లు అనిపించడంతో స్థానికంగా ఉన్న ఓ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. ఈసీజీ, 2డీ ఎకో తదితర టెస్టులు నిర్వహించిన డాక్టర్లు.. వంశీని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఒకటి రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని కుటుంబీకులు, సన్నిహితులకు వైద్యులు తెలిపారు.

AP Debts | CAG : జగన్ సర్కారు అప్పులు తక్కువే! -కాగ్ రిపోర్టులో అనూహ్య లెక్కలు..గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఐఎస్‌బీలో చదవుతోన్న కోర్సుకు చాలా ప్రాధాన్యం ఉంది. సివిల్స్ అధికారులు సైతం ఈ కోర్సుకోసం పోటీ పడతారు. జాతీయ స్థాయి పరీక్షలో మెరుగైన ప్రదర్శనతో 40 శాతం స్కాలర్షిప్ సైతం పొందేలా వంశీ సీటు సంపాదించారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణించిన వంశీ.. 1995లోనే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తో ఎంవీఎస్సీ పూర్తి చేయడం తెలిసిందే.

Published by:Madhu Kota
First published:

Tags: AP News, Gannavaram, Vallabhaneni Vamshi, Vallabhaneni vamsi

ఉత్తమ కథలు