గుజరాత్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు రాష్ట్రానికి చేరుకున్నారు. మొత్తం 4385 మంది జాలర్లు 56 బస్సు్ల్లో ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేటకు చేరుకున్నారు. వారికి కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, అధికారులు స్వాగతం పలికారు. కాగా, మత్స్యకారులకు ఆంధ్రా బోర్డర్లో ఆహారం అందజేశారు. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు జీవనోపాధిని వెతుక్కుంటూ గుజరాత్‌కు వెళ్లిన వెరావల్‌లో చిక్కుకున్నారు. కాంట్రాక్టర్ల కింద ఫిషింగ్ హార్బర్లలో పని చేస్తూ చేపట వేట కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారిలో 2911 మంది ఉన్నారు. విజయనగరం జిల్లాకు చెందినవారు 711మంది ఉన్నారు. మిగిలిన వారు ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు.
అయితే, వీళ్లు లాక్డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయారు. దాంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరగా.. స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ, గుజరాత్ సహా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకొని స్వస్థలాలకు చేర్చాయి. అయితే మత్స్యకారులందరూ ఆయా జిల్లాల్లోని క్వారంటైన్ సెంటర్లలోనే 14 రోజుల పాటు గడపాల్సి ఉంటుంది. క్వారంటైన్ పూర్తయ్యాక ఇళ్లకు పంపనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.