సముద్ర తీరాన సీఎం జగన్‌ ఫొటోకు పాలాభిషేకం..

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట సముద్ర తీరంలో మత్స్యకారులు సీఎం జగన్‌ ఫొటోకు పాలాభిషేకం చేశారు.

news18-telugu
Updated: May 8, 2020, 10:02 AM IST
సముద్ర తీరాన సీఎం జగన్‌ ఫొటోకు పాలాభిషేకం..
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మత్స్యకారులు
  • Share this:
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట సముద్ర తీరంలో మత్స్యకారులు సీఎం జగన్‌ ఫొటోకు పాలాభిషేకం చేశారు. కరోనా లాక్‌డౌన్ వల్ల జీవనోపాధి లేక అల్లాడిపోతున్న తమ కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపేలా, మత్స్యకార భరోసా పథకం ద్వారా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారని సీఎంకు అభిషేకం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేశారు. జిల్లాలో 15,225 మంది మత్స్యకారులకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అకౌంట్‌లో జమ చేయగా, వారిలో కావలి నియోజకవర్గానికి చెందిన 6,213 మంది మత్స్యకారులు ఉన్నారని, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చొరవ వల్లే ఇంతమందికి ఆర్థిక సహాయం అందిందని మత్స్యకారులు తెలిపారు.

తమ సముద్ర తీరం వద్దనే మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మించడానికి సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆఫ్కాఫ్ ఛైర్మన్ కొండూరు అనీల్ బాబు చర్యలు తీసుకొంటున్నారని, అందుకు వారికి రుణపడి ఉంటామని వెల్లడించారు. అయితే, కరోనా విజృంభిస్తున్న వేళ ఏ ఒక్కరూ లాక్‌డౌన్ రూల్స్ పాటించకపోవడం వివాదం రేపుతోంది. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
First published: May 8, 2020, 10:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading