వెహికల్ ట్యాక్స్‌పై ఏపీ ప్రభుత్వం స్వల్ప ఊరట...

వెహికల్ ట్యాక్స్‌పై ఏపీ ప్రభుత్వం స్వల్ప ఊరట...

భారీ వాహనాలైన లారీలు, బస్సులు, ఇతరత్రా గూడ్స్ వెహికల్స్‌ను మరో కేటగిరీగా భావించి వాటికి జరిమానాలు వేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెహికల్ ట్యాక్స్ చెల్లింపుల గడువును జూన్ 30 వరకు పొడిగించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెహికల్ ట్యాక్స్ చెల్లింపుల గడువును జూన్ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 30 నాటికి వెహికల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే, దీన్ని మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి వెహికల్ ట్యాక్స్ అడ్వాన్స్‌గా చెల్లిస్తారు. ప్రతి త్రైమాసికానికి చెల్లింపులు ఉంటాయి. ఒకవేళ వెహికల్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే జరిమానాలు 50 శాతం నుంచి 200 శాతం వరకు ఉంటాయి. అయితే, ప్రభుత్వం గడువును పొడిగిస్తూ కొంచెం ఊరటను కల్పించింది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొనడంతో సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి. వ్యాపారం సాగడం లేదు. దీంతో ట్యాక్స్ చెల్లింపు విషయంలో వెసులుబాటు కల్పించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ కోరడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు