హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Liquor Shops: ఏపీలో ప్రైవేట్ వ్యక్తులకు వైన్ షాపులు.. ప్రభుత్వం స్పందన ఇదే..!

AP Liquor Shops: ఏపీలో ప్రైవేట్ వ్యక్తులకు వైన్ షాపులు.. ప్రభుత్వం స్పందన ఇదే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం వైన్ షాపులు (AP Wine Shops) ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేసి.. వాటన్నింటినీ ఎక్సైజ్ శాఖే నడిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం వైన్ షాపులు (AP Wine Shops) ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేసి.. వాటన్నింటినీ ఎక్సైజ్ శాఖే నడిపిస్తోంది. మద్యపాన నిషేధంలో భాగంగా షాపుల సంఖ్య కూడా తగ్గించింది. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ధరలు కూడా పెంచింది. ఐతే మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వం.. మద్యం అమ్మకాలను గ్యారెంటీగా చూపి అప్పులు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా మద్యంపై ఆదాయాన్ని పెంచుకునేందుకు మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగిస్తారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాలు పెంచడంతో పాటు లైసెన్సు ఫీజు రూపంలో వచ్చే ఆదాయం కోసం ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరిగింది.

ఐతే ఈ ప్రచారంపై ఏపీ ఎక్సైజ్ శాఖ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణకు కట్టుబడి ఉందని.. మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగిస్తామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. రాష్ట్రంలో మద్యం నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపింది. మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే చాలా అనర్ధాలున్నాయని.. ముఖ్యంగా బెల్టు షాపులుతో పాటు మద్యం సరఫరా టైమింగ్స్ తో పాటు చాలా రూల్స్ బ్రేక్ చేస్తారని ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఇది చదవండి: రికార్డుస్థాయిలో వరద.. లంక గ్రామలను ముంచెత్తిన గోదారి..


వీటిని నివారించడానికే మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టిందని తెలిపింది. అంతేకాకుండా 2019లో రాష్ట్రంలోని మద్యం షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు కుదించి మద్యం వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తున్నట్లు పేర్కొంది. గత మూడేళ్లలో మద్యం నియంత్రణలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రభుత్వం చేరుకుంటోందని.. ఇలాంటి సమయంలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదని తెలిపింది.

ఇది చదవండి: చంద్రబాబు మా అన్నయ్య.. బంధుత్వంపై విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు


అలాగే ఏపీఎస్పీడీసీఎల్.. సెబీలో నమోదు చేసుకొని డిబెంచర్లను జారీ చేస్తోందని తెలిపింది. సెబీ నిబంధనలకు లోబడే లావాదేవీలు జరుపుతోందని.. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. ప్రతి ఏడాది చట్టప్రకారం అన్ని లావాదేవీలను ఆడిట్ చేయడం జరుగుతోందని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్రప్రభుత్వం విక్రయిస్తున్న మద్యంలో విషపదార్థాలున్నాయంటూ ప్రచారం జరుగుతోందని.. వాటిలో ఎలాంటి నిజం లేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబ్ లో నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి విషపదార్థాలు లేవని రుజువైందని పేర్కొంది. అలాగే ఏపీ మద్యంలో విషపదార్థాలున్నట్లు తామెప్పుడు చెప్పలేదని ఎస్జీస్ ల్యాబ్ స్పష్టం చేసినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

First published:

Tags: Andhra Pradesh, Liquor policy

ఉత్తమ కథలు