హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Liquor Brands: మద్యం బ్రాండ్లపై ముదిరిన పొలిటికల్ వార్.. ఎక్కడా తగ్గని ప్రభుత్వం.. రంగంలోకి ఉన్నతాధికారులు..

AP Liquor Brands: మద్యం బ్రాండ్లపై ముదిరిన పొలిటికల్ వార్.. ఎక్కడా తగ్గని ప్రభుత్వం.. రంగంలోకి ఉన్నతాధికారులు..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మద్యం చుట్టూనే తిరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) జంగారెడ్డిగూడెంలో వరుస మరణాల తర్వాత అధికార వైసీపీ ()YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరాయి.

ఇంకా చదవండి ...

  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మద్యం చుట్టూనే తిరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) జంగారెడ్డిగూడెంలో వరుస మరణాల తర్వాత అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరాయి. వైసీపీ హయాంలో అక్రమ మద్యం, నాటుసారా మాఫియా పెరిగిపోయాయని.. కొత్త బ్రాండ్ల మద్యం వెనుక సీఎం జగన్ ఉన్నారంటూ టీడీపీ అంటుంటే.. అసలు ఆ మద్యం బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు అంటూ వైసీపీ ఆధారాలతో సహా కౌంటర్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో సీన్ లోకి ఉన్నతాధికారులు కూడా ఎంటర్ అయ్యారు. అసలు రాష్ట్రంలో కల్తీ మద్యం అనేదేలేదని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. దీనిపై దురుద్దేశంతోనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

  రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మద్యంపై నిరంతరం నిఘా ఉందని.. గతంలో ఏడాదికి 90వేల నమూనాలను పరీక్షిస్తే.. ఇప్పుడు ఏకంగా లక్షన్నర శాంపిల్స్ టెస్ట్ జరుగుతోందని రజత్ భార్గవ తెలిపారు. అంతేకాదు జంగారెడ్డిగూడెం మరణాల వెనుక నాటుసారా గానీ, కల్తీ మద్యం గానీ కారణం కాదన్న ఆయన వారిలో ఎవరూ ఒకేచోట సారా కొనలేదని.. వేర్వేరు లక్షణాలతో మృతి చెందారన్నారు.

  ఇది చదవండి: బూమ్ బూమ్ బాబు, టీడీపీ ప్రెసిడెంట్ మెడల్.., ఏపీలో మద్యం బ్రాండ్లపై వైసీపీ 

  ఇక ప్రతిపక్షాలు ప్రధానంగా విమర్శిస్తున్న మద్యం బ్రాండ్లపై రజత్ భార్గవ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం విక్రయిస్తున్న బ్రాండ్లకు గత 2018లోనే అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 2018 తర్వాత కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుటోందని.. అందుకే రాష్ట్రంలో 4,380 మద్యం షాపులను 2,934కి తగ్గించామన్నారు. వైన్ షాపుల సమయాలను కూడా కుదించడం వల్ల.. 2018-19తో పోలిస్తే 2019-20లో 25శాతం మేర మద్యం, 59శాతం బీర్ అమ్మకాలు, 2020-21లో 40శాతం మద్యం, 77 శాతం బీరు విక్రయాలు తగ్గాయన్నారు.

  ఇది చదవండి: ఏపీలో మద్యపాన నిషేధం సాధ్యమేనా..? ఆ విషయంలో జగన్ సర్కార్ ఫెయిల్ అయిందా..?

  ఇక రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. స్పెషల్ ఎన్ ఫోర్స్ మంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ తెలిపారు. 2020లో సెబ్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 93,722 కేసులు నమోదు చేసి, 70 వేల మందిని అరెస్ట్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. గత 10 రోజుల్లోనే 2,051 కేసులు నమోదు చేసి 1,260మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

  ఇది చదవండి: మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్న జగన్.. ఈసారి కూడా వర్కవుట్ అవుతుందా..?

  ఇదిలా ఉంటే ప్రస్తుతం విక్రయంలో ఉన్న బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్, రాయల్ పాలెస్ లాంటి మద్యం బ్రాండ్లకు టీడీపీ హయాంలో చంద్రబాబే అనుమతిచ్చారని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వీటిలో చాలా వరకు టీడీపీ నేతలు వారి బంధువులకు చెందిన డిస్టలరీలే ఉన్నాయని విమర్శిస్తోంది.

  First published:

  Tags: Andhra Pradesh, Ap government, Liquor

  ఉత్తమ కథలు