టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ అకాల మరణం పట్ల టాలీవుడ్‌తో పాటు సినీ ప్రముఖులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రముఖ రాజకీయ నేతలంతా వేణుమాధవ్ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ కూడా వేణుమాధవ్ మరణం విచారకరమన్నారు.‘ ప్రముఖ సినీ హాస్యనటులు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి వేణుమాధవ్ గారి మరణం విచారకరం. ఎన్టీఆర్ గారి హయాం నుంచి నేటివరకు పార్టీకి వేణుమాధవ్ గారు చేసిన సేవలు వెలకట్టలేనివి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా వేణుమాధవ్ మృతి పట్ల విచారం వ్యక్తంచేశారు. మిమిక్రీ కళాకారుడిగా, సినీ హాస్య నటుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారన్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ప్రత్యేకతతో ప్రజలని ఆకట్టుకున్నారు. వేణుమాధవ్ మృతికి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ప్రముఖ సినీ హాస్యనటులు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి వేణుమాధవ్ గారి మరణం విచారకరం. ఎన్టీఆర్ గారి హయాం నుంచి నేటివరకు పార్టీకి వేణుమాధవ్ గారు చేసిన సేవలు వెలకట్టలేనివి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.