ప్రభాస్ 'సాహో' మూవీపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ కార్యకర్తలంతా సాహో మూవీ చూడాలని పిలుపు నిచ్చారు. నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు సినీ వర్గాల్లోనూ..అటు రాజకీయ వర్గాలోనూ చర్చనీయాంశంగా మారాయి. లోకేష్ చేసిన ఈ ట్వీట్ల వెనక బలమైన కారణమే ఉంది.

news18-telugu
Updated: August 19, 2019, 8:04 PM IST
ప్రభాస్ 'సాహో' మూవీపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభాస్, నారా లోకేశ్
  • Share this:
'సాహో' మూవీపై మాజీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానుల్లాగే తానూ సాహో చిత్రం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో మూవీ.. బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాదు టీడీపీ కార్యకర్తలంతా సాహో మూవీ చూడాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి. నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు సినీ వర్గాల్లోనూ..అటు రాజకీయ వర్గాలోనూ చర్చనీయాంశంగా మారాయి. లోకేష్ చేసిన ఈ ట్వీట్ల వెనక బలమైన కారణమే ఉంది.

ఇటీవల చెన్నైలో ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ పనితీరును ప్రభాస్ మెచ్చుకున్నారు. రాజకీయాలు తనకు పెద్దగా తెలియదని.. కానీ సీఎం జగన్ ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని వెల్లడించారు. ఐతే సీఎం జగన్‌ని ప్రభాస్ ప్రశంసించడాన్ని టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేపోతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సాహో మూవీకి వ్యతిరేకంగా టీడీపీ నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తోందని ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. ఆ వెబ్‌సైట్ కథనంపై ట్విటర్ వేదికగా లోకేష్ స్పందించారు. ఇంతలా దిగజారి వార్తలు రాయడం సరికాదని సదరు వెబ్‌సైట్‌పై ఆయన మండిపడ్డారు.
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుజీద్ దర్శకత్వంలో రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో సాహో మూవీ తెరకెక్కింది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆగస్టు 30న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>