టీటీడీ ఆస్తుల వేలంపై ఏపీలో దుమారం రేగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టుతున్నారు. తాజాగా ఆ లిస్టులో టీటీడీ మాజీ ఈవో, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు చేరారు. టీటీడీ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలకు పునరావాస కేంద్రంగా మారిపోయిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశమంతా స్థిరాస్తి రంగం కోలుకోలేని పరిస్థితితో ఉంటే ఆస్తులను విక్రయానికి పెడతారా? అని మండిపడ్డారు. సదావర్తి భూముల అమ్మకంపై అప్పట్లో వైసీపీ హడావిడి చేసిందని.. మరి మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దాతలు ఇచ్చేటప్పుడు తీసుకుని ఇప్పుడు అమ్మేస్తామంటే సరైన పద్ధతేనా అని విమర్శలు గుప్పించారు. టీటీడీ బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని.. భక్తిభావం ఉన్నవారిని సభ్యులుగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని ఐవైఆర్ సూచించారు. ఇక ఈ సమస్యపై గళం విప్పిన పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు ఐవైఆర్
Thanks @PawanKalyan Garu for raising your voice on an important issue . Good example can be set and best practices followed when devoted people with commitment are at helm of affairs .when #ttd becomes rehabilitation centre for politicians and businessmen nothing good expected. https://t.co/6pAwliskiq
— IYRKRao , Retd IAS (@IYRKRao) May 25, 2020
తిరుమల శ్రీవారి స్థిరాస్తులను వేలం వేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఉన్న 28 ఆస్తులు విక్రయించేందుకు ఇప్పటికే రెండు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించింది. దీనిపై మే 28న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Pawan kalyan, Tirumala news, Tirumala Temple, Ttd