Chandrababu Deeksha: టీడీపీ ఆఫీసులో చంద్రబాబు దీక్ష.. పగిలిన అద్దాలు, ఫర్నిచర్ మధ్యే నిరసన

చంద్రబాబు దీక్ష

Chandrababu naidu deeksha: అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు నాయుడు దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు కూడా వేదికపై ఉన్నారు. ఆఫీసులో పగిలిన అద్దాలు, ఫర్నిచర్ మధ్యే చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. టీడీపీ (TDP), వైసీపీ (YCP) మాటల యుద్ధం, నేతల అరెస్ట్‌లతో రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కాయి.  ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ, మాజీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu naidu) అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీక్షకు కూర్చున్నారు. టీడీపీ కార్యాలయాలు, పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా.. ''ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు'' పేరుతో 36 గంటల పాటు దీక్ష చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఇవాళ ఉదయం 08.15 సమయంలో చంద్రబాబు నాయుడు టీడీపీ ఆఫీసుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు కూడా వేదికపై ఉన్నారు. ఆఫీసులో పగిలిన అద్దాలు, ఫర్నిచర్ మధ్యే చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నారు.

    Pattabhi Arrest: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్‌.. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు

    అక్టోబరు 19న సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS jagan mohan reddy)పై టీడీపీ నేత పట్టాభి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో రాజకీయ దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు మంగళవారం సాయంత్రం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఆఫీసు లోపలికి చొరబడి అద్దాలు పగులగొట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. అంతేకాదు టీడీపీ నేత పట్టాభి ఇంటిపైనా దాడులు పాల్పడ్డారు. ఈ ఘటనలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాయి. కానీ పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో బంద్ విఫలమయింది. అటు వైసీపీ శ్రేణులు కూడా టీడీపీకి పోటీగా నిరసనలు చేపట్టాయి. సీఎం జగన్‌పై టీడీపీ నేతల అసభ్యకర వ్యాఖ్యలకు నిరనసగా ఆందోళలు చేశారు.

    Nara Lokesh: లోకేష్ కు ఇదే మంచి ఛాన్స్..? ప్రజల్లోకి వెళ్లి క్యాష్ చేసుకుంటారా..?

    ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరిట నిరసన చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఈ అంశంపై చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు, నేతలకు రక్షణ లేకుండాపోయిందని, పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ముకాస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు చంద్రబాబునాయుడు.

    Chandrababu Naidu: ఏపీ పొలిటికల్ వార్.. టీడీపీకి వైసీపీ అనుకోని ఆయుధం ఇచ్చిందా ?

    మరోవైపు సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.పట్టాభి ఇంట్లో నుంచి బయటకు రావాలని పోలీసులు మొదట మైక్‌లో ప్రకటించారు. అయితే పట్టాభి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో.. పోలీసుల తలుపులు పగలగొట్టి ఆయనను బయటకు తీసుకొచ్చారు. దీనిపై ఆయన భార్య పోలీసులు, ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎఫ్ఐఆర్‌ సహా ఏ సమాచారం ఇవ్వకుండానే పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారని పట్టాభి భార్య ఆరోపించారు. ఈ వరుస పరిణామాలతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: