గుర్తుకొస్తున్నాయి.... ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిన చంద్రబాబు

కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబు తన పాత జ్ఞాపకాలను ఓ సారి నెమరవేసుకున్నారు.

news18-telugu
Updated: February 25, 2020, 7:00 PM IST
గుర్తుకొస్తున్నాయి.... ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిన చంద్రబాబు
యూనివర్సిటీలో స్నేహితులతో చంద్రబాబు
  • Share this:
ఎంత గొప్పవారైనా గత జ్ఞాపకాలు మదిలో మెదిలితే ఒక్కసారి ఎమోషన్ అయిపోతుంటారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ, అధినేత చంద్రబాబునాయుడికి సైతం కుప్పం పర్యటన సందర్భంగా అదే భావన కలిగింది. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా రెండు రోజుల నుంచి కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు... కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా తన ఎస్వీ యూనివర్సిటీలోని తన నా సహాధ్యాయి రత్నం కుటుంబాన్ని కలిశారు. తన స్నేహితుడి తండ్రి 98 ఏళ్ల పి.ఆర్. శ్యామ్‌ను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా రత్నం తన దగ్గర ఉన్న పాత ఫోటోలను చంద్రబాబుకు చూపించారు. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోయారు. తన కాలేజీ రోజులు, ఆనాటి స్నేహాలు అన్నీ ఆయనకు గుర్తొచ్చాయి. మనసుకు తెలియని ఉత్సాహం వచ్చిందని చంద్రబాబు తెలిపారు.First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు