Home /News /andhra-pradesh /

చంద్రబాబు,లోకేష్, మోహన్ బాబు సహా బాలయ్యకు బర్త్ డే విషెస్ వెల్లువ..

చంద్రబాబు,లోకేష్, మోహన్ బాబు సహా బాలయ్యకు బర్త్ డే విషెస్ వెల్లువ..

బాలయ్యకు చంద్రబాబు, మోహన్ బాబు, లోకేష్ సహా పలువురి శుభాకాంక్షలు (Twitter/Photo)

బాలయ్యకు చంద్రబాబు, మోహన్ బాబు, లోకేష్ సహా పలువురి శుభాకాంక్షలు (Twitter/Photo)

ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ తో పాటు మోహన్ బాబుతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేసారు.

ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్  చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఇక బాలకృష్ణతో పలు సినిమాల్లో నటించిన నట ప్రపూర్ణ మోహన్ బాబు  బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. నా సోదరుని కుమారుడైన నందమూరి బాలకృష్ణ..100 ఏళ్లు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాములతో నిండు నూరేళ్లు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరకుంటున్నాను అంటూ విషెస్ తెలియజేసారు.


మరోవైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలయ్య  వియ్యంకుడు చంద్రబాబు నాయుడు కూడా బావమరిది బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. నటన అయినా.. ప్రజాపేవ అయినా.. చేసే పనిలో నూటికి నూరుపాళ్లు నిబద్ధతో ఉండే వ్యక్తి బాలకృష్ణ. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలయ్య అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.



ఇక బాలయ్య మేనల్లుడు నారా లోకేష్ కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన అందరికీ బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు మా బాలయ్య మావ. ఆయనకు షష్టి పూర్తి శుభాకాంక్షలు. మరోవైపు నిన్న విడుదలైన బాలయ్య కొత్త టీజర్ పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ టీజర్‌లో బాలకృష్ణ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉన్నారు. మావయ్యా మరెన్నో చిత్రాల్లో నటించి.. మీ అభిమానులను ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.





మరోవైపు మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. అటు హీరో సాయి ధరమ్ తేజ్, తారకరత్నతో పాట దర్శకులు హరీష్ శంకర్, బాబీ, బోయపాటి శ్రీను, క్రిష్ బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.















Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Balakrishna, Chandrababu naidu, Mohan Babu, Nara Lokesh, NBK, Sai Dharam Tej, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు