హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kanipakam: కాణిపాకంలో అభిషేకం టికెట్ ధర రూ. 7000కు పెంపు.. ఏపీ ప్రభుత్వం సీరియస్

Kanipakam: కాణిపాకంలో అభిషేకం టికెట్ ధర రూ. 7000కు పెంపు.. ఏపీ ప్రభుత్వం సీరియస్

కాణిపాకం ఆలయం

కాణిపాకం ఆలయం

Andhra Pradesh: ప్రస్తుతం పంచామృతాభిషేకం టికెట్ ధర ప్రస్తుతం రూ. 750లు ఉంది. అయితే ఇప్పుడు 7 రేట్లు పెరగడంతో.. రూ. 750 టికెట్ ధరను ఏకంగా రూ. 5000లకు చేరుకుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో అభిషేకం టికెట్ ధర పెంపు అంశంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఏపీ దేవాదాయశాఖ (AP Endownment) స్పందించింది. టికెట్ ధరను రూ. 5000 చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. స్థానిక ఆలయ అధికారుల తీరు వల్లే ఇలా జరిగిందని వెల్లడించింది. దీనిపై విచారణ జరిపి.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏపీ దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. అంతకుముందు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో స్వామివారి పంచామృతాభిషేకం(Abhishekam) టికెట్ ధరలను పెంచుతూ ఆలయాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆలయంలో పంచామృతాభిషేకం ధర 7 రెట్లు పెంచారు. ప్రస్తుతం పంచామృతాభిషేకం టికెట్ ధర ప్రస్తుతం రూ. 750లు ఉంది. అయితే ఇప్పుడు 7 రేట్లు పెరగడంతో.. రూ. 750 టికెట్ ధరను ఏకంగా రూ. 5000లకు చేరుకుంది.

  వరసిద్ధి వినాయకుడి ఆలయంలో ఇప్పటి వరకూ ప్రతి రోజూ మూడుసార్లు పంచామృత అభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక అభిషేకానికి భారీగా టికెట్ ధరను నిర్ణయించింది దేవస్థానం. అయితే ఈ పంచామృతాభిషేకం ధర పెంపు పై అభిప్రాయాలను తెలిపేందుకు ఉభయదారులకు 15 రోజులు గడువు విదించింది. ఈ మేరకు ఒక నోటీసుని కూడా విడుదల చేసింది.

  ఈ మొత్తం వ్యవహారం గందరగోళానికి దారి తీయడంతో రాష్ట్ర దేవాదాయశాఖ ఈ అంశంపై స్పందించింది. ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వం, స్థానిక ఆలయ కమిటీతో చర్చించుకుండా టికెట్ ధర పెంచడంపై అభిప్రాయాలు చెప్పాలని అక్కడి ఈవో నోటీసు ఇచ్చారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

  YSRCP-BRS: బీఆర్ఎస్‌పై వైసీపీ అదే రకమైన ఆలోచనతో ఉందా ? వైసీపీ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు

  Alert to Devotees: నేరుగా భక్తులకే స్వామి సేవ చేసే అవకాశం.. ఈ నెల 11 నుండి శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాలు..

  ఆలయ ఈవో ఈ రకంగా చేయడాన్ని తప్పుబట్టారు. దీనిపై విచారణ జరుపుతామని.. ఈవో నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించినట్టయితే ఆయపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీ మంత్రి స్వయంగా దీనిపై స్పందించడంతో టికెట్ ధర పెంపు వ్యవహారంపై వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్టయ్యింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh

  ఉత్తమ కథలు