తిరుమల కొండపై ప్లేట్ ఇడ్లీ రూ.7.50 మాత్రమే...

కొండపై ప్రస్తుతం రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేస్తున్నారు.

news18-telugu
Updated: August 3, 2019, 9:10 AM IST
తిరుమల కొండపై ప్లేట్ ఇడ్లీ రూ.7.50 మాత్రమే...
తిరుమల శ్రీవారి ఆలయం
news18-telugu
Updated: August 3, 2019, 9:10 AM IST
తిరుమల కొండకు నిత్యం వేలాది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. కొండపై భక్తులకు అతి తక్కువ ధరలకే భోజన సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టింది దేవాదాక శాఖ.  భక్తులను ఎడాపెడా దోచుకుంటున్న హోటళ్లపై దృష్టి పెట్టింది. కొండపై ప్రస్తుతం రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేస్తున్నారు. ఇకపై వీటి ధరలను చెక్ పెట్టారు అధికారులు.

ఇక నుంచి కొండపై ప్లేట్ ఇడ్లీ రూ.7.50,  భోజనం రూ.22.50గా విక్రయించాలని నిర్ణయించింది. ఫుల్ మీల్స్‌కు రూ.31గా తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొండపై 17 పెద్ద హోటళ్లు, 8 చిన్న హోటళ్లు, 150 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, 30 చిరు దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఎవరైనా నిర్ణయించిన ధరకు కాకుండా ఎక్కువ ధరకు విక్రయిస్తే టోల్‌ఫ్రీ నంబరు 18004254141కి ఫోన్ చేయాలని ఏపీ ఎండోమెంట్స్ విభాగం తెలిపింది. దేవాదాయ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

First published: August 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...