Home /News /andhra-pradesh /

AP ENDORSEMENT MINISTER VELLAMPALLI SRINIVAS VIDEO CONFERENCE WITH OFFICIALS SK

దేవాలయాలు తెరిచేందుకు సిద్ధమవ్వండి.. అధికారులకు మంత్రి ఆదేశం

తిరుమల ఆలయం

తిరుమల ఆలయం

ప్రతి భక్తుడు దేవాలయం లోకి వచ్చి వెళ్లేంత వరకు సంతృప్తికరమైన సేవలు, దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.

    సీఎం ఆదేశాల అనంతరం దేవాలయాలు తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ప్రతి భక్తుడు మనకు వి.ఐ.పీనే అని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని భద్రతా చర్యలు చేపడుతూ.. ఆలయాల్లో భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండిని స్పష్టం చేశారు.  దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో మంత్రి వెల్లంపల్లి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని మాట్లాడారు. ప్రతి భక్తుడు దేవాలయం లోకి వచ్చి వెళ్లేంత వరకు సంతృప్తికరమైన సేవలు, దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి సీఎం జగన్ నిర్ణయంతో త్వరలో దేవాలయాలు తెరిచేందుకు అందరూ సిద్ధం కావాలి. గతంలో డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం సూచనలను, మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. దేవాలయానికి వచ్చే చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తో పాటు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. ప్రతి దేవాలయములో వృధా ఖర్చులు తగ్గించుకునేందుకు అధికారులు శ్రద్ధ చూపించాలి.
    వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి

    ysrcp minister vellampally coments on pawankalyan
    మంత్రి వెల్లంపల్లి (ఫైల్ ఫొటో)


    అటు దేవాలయాల భూముల పరిరక్షణ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం గారు పలు సూచనలు ఇచ్చారని తెలిపారు. దేవాలయ భూములు కాపాడుకునేందుకు.. భూముల విషయంలో లీగల్ సమస్యలు పరిష్కరించుకునేందుకు కమిషన్ కార్యాలయం నుంచి వచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. ప్రతి దేవాలయం విధిగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్న మంత్రి..  ఇప్పటికే ప్రతి దేవాలయంలో పరోక్ష సేవలను ప్రోత్సహిస్తూ సూచనలు ఇచ్చామని తెలిపారు.  గతంలో ఇచ్చిన సూచనల ప్రకారం ఆన్లైన్ సేవలు , డిజిటల్ ట్రాన్సక్షన్ పై శ్రద్ధ చూపించాలని చెప్పారు. కాగా,  సమావేశంలో దేవదాయశాఖ కమిషనర్ అర్జున్ రావు, 13 జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, మరియు నాలుగు జోన్ల డిప్యూటీ కమిషనర్, ఆర్ జె సి లు తదితరులు పాల్గొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Lockdown, Lockdown relaxations

    తదుపరి వార్తలు