హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Government vs Employees: ఆ హామీ ఇవ్వాల్సందే.. లేదంటే తగ్గేదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు..

Government vs Employees: ఆ హామీ ఇవ్వాల్సందే.. లేదంటే తగ్గేదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు..

ap employees jac(Photo:Face Book)

ap employees jac(Photo:Face Book)

Government vs Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగుల వార్ మళ్లీ తీవ్రం అవుతోంది. ముఖ్యంగా ఆ హామీ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తగ్దేదే లే అని తెగేసి చెబుతున్నారు.. ఇంతకీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Government vs Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వర్సెస్ ఉద్యోగుల (AP Employees) వార్ మరింత ముదిరేలా ఉంది. ఎందుకంటే ఈ నెల 9వ తేది నుంచి ఉద్యోగుల ఉద్యమ కార్యచరణ ప్రారంభమవుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ (AP JAC Amaravati Chairman ) బొప్పరాజు వెంకటేశ్వరులు (Bopparaju Venkateswarulu) తెలిపారు. పిఆర్‌సి, అరియర్స్‌, ఇతర సమస్యలపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హమీ ఇస్తే తప్ప తమ ఉద్యమాన్ని ఆపేదిలేదన్నారు. మధ్యలో ఎన్ని సమావేవాలు పెట్టినా.. ఎలాంటి ప్రకటనలు చేసినా.. తగ్గేదే లేదన్నారు. ఇదే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి తేల్చిచెప్పామన్నారు.

ఒంగోలులో ఏపీ జేఏసి అమరావతి ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్న బొప్పరాజు ఈనెల 9వ తేది నుంచి జరగనున్న ఉద్యామాన్ని విజయవంతం చేయాలని అన్ని రాకాల ఉద్యోగులను కోరారు. ఉద్యమం ప్రారంభం నాటికి మిగిలిన సంఘాలు కూడా తమతో కలిసి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తామన్నారు.

అయితే తాము చేస్తున్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం లేదన్నారు. కేవలం ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తున్నామన్నారు. సకాలంలో జీతాలు రాక చాలామంది ఉద్యోగులు లోన్‌యాప్‌ల్లో అప్పులు తీసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో డిఆర్‌డిఏ ఉద్యోగి జీతం లేక డయాలసిస్‌ చేయించుకోలేక చనిపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

ఇదీ చదవం: 14 ఏళ్ల పాటు ఇల్లే జైలు కేసులో సరికొత్త ట్విస్టులు.. షాకిస్తున్న వాస్తవాలు

గతంలో తమకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు.. రావాల్సిన బకాయిల కోసం.. ఇప్పటికే ఇవ్వాల్సినదానికన్నా ఎక్కువ సమయం ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. మొన్నటి వరకు రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు, కరోనా కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సహకరించామన్నారు. తామిచ్చిన సహకారాన్ని ప్రభుత్వం చులకనగా తీసుకుని చేతకానివారికింద జమ కట్టిందని ఆయన ఆరోపించారు.

ఇదీ చదవం : 2024 వైసీపీకి వచ్చే సీట్లు ఎన్ని.. ఆ సీట్ల కోసం మాత్రమే టీడీపీ పోటీ

తామేమే అడకూడనవి ఏమీ అడగడం లేదు అన్నారు. న్యాయంగా, చట్టబద్దంగా జీతాలు పెంచాల్సి ఉన్నా 11వ పీఆర్‌సీని అమలు చేయలేదన్నారు వెంకటేశ్వర్లు. 10 వ పీఆర్‌సీ రాయితీలను కూడా కట్‌ చేశారని వాపోయారు. ఇవ్వాల్సిన వాటిలో కోత విధించడం, జీతాలు పెంచకపోవడం, దాచుకున్న డబ్బులు కూడా పొందలేని పరిస్థితులను కల్పించినందునే ఉద్యమానికి సిద్దమయ్యామని స్పష్టం చేశారాయన. 11వ పీఆర్‌సీ అరియర్స్‌ కోసం నాలుగురోజుల క్రితం ఇచ్చిన జీవోలో కూడా తాము రిటైర్‌ అయిన తరువాత ఇస్తారంటున్నారని, ఇది కుట్రకాదా? అని ప్రశ్నించారు. .. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు లేవని, నిధులు లేవని, పైపెచ్చు ప్రజల్లో చులకన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, Employees

ఉత్తమ కథలు