Andhra Pradesh: ఏపీలోని కాలేజీలు, స్కూల్స్‌కు విద్యాశాఖ మంత్రి హెచ్చరిక

ఆదిమూలపు సురేష్(ఫైల్ ఫొటో)

Andhra Pradesh: విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని అన్నప్పుడే పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.

  • Share this:
    ఏపీలో పరీక్షలు నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పిన ప్రభుత్వం.. ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షలు రద్దయ్యాయని కాలేజీలు అడ్మిషన్లు తీసుకుంటే కఠినంగా వ్యవరిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్ తెలిపారు. ఈ విషయంలో ఒక్క ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. దీనిపై టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి సురేశ్ తెలిపారు. ఇక ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం వీసీని నియమించామని వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొనే పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

    పరీక్షల నిర్వహణపై గురువారం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అయితే ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి సురేశ్ అన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని అన్నప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. పరిస్థితిలు అనుకూలించిన తర్వాతే పరీక్షలు పెడతామని మంత్రి సురేశ్ వెల్లడించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: