హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Govt OTT: త్వరలో జగనన్న ఓటీటీ..? విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

AP Govt OTT: త్వరలో జగనన్న ఓటీటీ..? విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

కరోనా (Corona) కారణంగా ఆన్ లైన్ క్లాసులు (Online Classes), టీవీల ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పించిన ప్రభుత్వం.. మరో వినూత్న ఆలోచన చేస్తోంది. పాఠశాలల్లో టెక్నాలజీకి పెద్దపీట వేస్తోంది. విద్యాబోధన కోసం వినూత్న ఆలోచన చేస్తోంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమ్మఒడి పథకం (Ammavodi Scheme) ద్వారా విద్యార్థులకు ఆర్ధిక సాయం చేస్తున్న ప్రభుత్వం.. ఇంటర్ విద్యార్థలకు ఇదే స్కీమ్ కింద ల్యాప్ టాప్ లు అందిస్తోంది. కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు, టీవీల ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పించిన ప్రభుత్వం.. మరో వినూత్న ఆలోచన చేస్తోంది. పాఠశాలల్లో టెక్నాలజీకి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే విద్యార్థుల వివరాలు, పాఠశాలల్లో సమస్యల నమోదు కోసం యాప్ ను సిద్ధం చేసిన ప్రభుత్వం.. త్వరలో మరింత అప్ డేటెడ్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. కార్పొరేట్ స్టైల్ ఎడ్యుకేషన్ అందించేందుకు ప్రభుత్వం కూడా ఓటీటీని తీసుకొచ్చే ఆలోయనలో ఉంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

  శనివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కొత్త రాజాపేటలో రూ.6కోట్లతో నిర్మించిన గురుకుల పాఠశాల భవనాలను మంత్రి సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ అంతా డిజిటల్ రంగానిదేనని అభిప్యాపడిన ఆయన.. విద్యార్థుల జీవితాల్లో ఆన్ లైన్ క్లాసులు కీలకపాత్ర పోషించబోతున్నాయన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందని.. అందుకే విద్య కోసం ప్రత్యేక ఓటీటీలను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డిజిటల్ విద్యలో భాగంగానే వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి పథకం కింద 9,10 తరగతులు చదివే విద్యార్థులకు కూడా ల్యాప్టాప్ లు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిపారు.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం.. ఐదు రోజుల ఉత్సవాల విశేషాలివే..!

  ఇప్పటికే విద్యాశాఖలో చాలా వరకు డిజిటల్ విధానం కొనసాగుతోందని.. విద్యార్థుల హాజరుతో పాటు మధ్యాహ్న భోజన వివరాలు, ఇతర అంశాలన్నీ ఆన్ లైన్ యాప్ లలో నమోదు చేయడం, అందులోనే ప్రభుత్వం పరిశీలించడం జరుగుతోందన్నారు. ట్రెండ్ కు తగ్గట్లుగా స్టూడెంట్స్, టీచర్స్ కూడా అప్ డేట్ కావాల్సిన అవసరముందని మంత్రి సురేష్ అన్నారు.

  ఇది చదవండి: కేబినెట్ లో కొనసాగేది వీరేనా..? సీఎం జగన్ మనసులో ఏముంది..? ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి..?

  ఇదిలా ఉంటే ఇప్పటికే బైజూస్ వంటి యాప్స్ విద్యావస్థలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. కరోనా టైమ్ లో పిల్లలు చదువులకు దూరం కాకుండా ఇలాంటి యాప్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. ఐతే కొన్ని యాప్స్ ను తీసుకోవడం బాగా ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యాప్ ద్వారా చదువుకోవడం కష్టమవుతోంది. అందుకే ప్రభుత్వం అమ్మఒడి ద్వారా ల్యాప్ టాప్స్ అందిస్తోంది. ఇప్పుడు ఓటీటీని కూడా అందుబాటులోకి తీసుకొస్తే.. టెక్నాలజీ పరంగానూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు అప్ డేట్ అయ్యే అవకాశముంది. ఐతే ఈ ఓటీటీ ఎప్పుడు వస్తుంది.. ఎలా వస్తుందనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే..!

  First published:

  Tags: Andhra Pradesh, Ap minister suresh, EDUCATION, Ott

  ఉత్తమ కథలు