హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఈరోజు నుంచి 28 వరకు ఏపీలో ఈ ప్రాంతాల్లో సూర్యుడి భగభగలు...

ఈరోజు నుంచి 28 వరకు ఏపీలో ఈ ప్రాంతాల్లో సూర్యుడి భగభగలు...

రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని స్పష్టం చేశారు.

రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి 28వ తేదీ వరకు వాతావరణం ఎలా ఉంటుందనే అంశంపై పలు హెచ్చరికలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి 28వ తేదీ వరకు వాతావరణం ఎలా ఉంటుందనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ  శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది . మే  25 నుంచి 28  వరకు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే   25 : 

విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో  44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం , విశాఖపట్నం, కృష్ణా , గుంటూరు , అనంతపురం జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 41°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే   26:

విజయనగరం ,  తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు  జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే   27:

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు ,  ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప , కర్నూలు, అనంతపురం జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం , విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38°C-40°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే   28:

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం , విశాఖపట్నం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

రాత్రి పూటలు కూడా సాధారణం కంటే 1°C-2°C ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.


  • ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయట రాకుడదని కోరారు.

  • వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు  తీసుకోవాలని కోరారు.

  • ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి.

  • మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.

First published:

Tags: Andhra Pradesh, Summer

ఉత్తమ కథలు