ఆ ఐదు జిల్లాలకు పిడుగు హెచ్చరిక.. బీ అలర్ట్..

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపారు.

news18-telugu
Updated: May 29, 2020, 4:42 PM IST
ఆ ఐదు జిల్లాలకు పిడుగు హెచ్చరిక.. బీ అలర్ట్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో శుక్రవారం సాయంత్రం పలు జిల్లాల్లో పిడుగులు పడవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ హెచ్చరించారు. విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని చెప్పారు.

పిడుగులు పడేందుకు అవకాశమున్న ప్రాంతాలు:

శ్రీకాకుళం జిల్లా:
సీతంపేట, కొత్తూరు, పాలకొండ, బుర్జ, రేగిడి ఆమదాలవలస, సరుబుజ్జిలి, లక్ష్మీనర్సుపేట, హీరామండలం, వంగర, వీరఘట్టం.

విజయనగరం జిల్లా:
కురుపాం, గరుగుబిల్లి, బలిజిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాచిపెంట, వేపాడ, సీతానగరం.

విశాఖపట్టణం జిల్లా:హుకుంపేట,అనంతగిరి, అరకులోయ.

చిత్తూరు జిల్లా:
పీలేరు , సదుం, కలికిరి, కలకడ, వాయల్పాడు, సోమాల, ఐరాల, పులిచెర్ల, గుర్రంకొండ, రామచంద్రపురం, ఏర్పేడు, నారాయణవనం, వెదురుకుప్పం

ప్రకాశం జిల్లా:
పామూరు , లింగసముద్రం, ఓలేటివారిపాలెం, పొన్నలూరు, పెదచెర్లోపల్లి, హనుమంతునిపాడు, తర్లుపాడు
First published: May 29, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading