రూల్స్ అతిక్రమిస్తే చర్యలు... వారికి ఏపీ డీజీపీ వార్నింగ్

మద్యం షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడంతో వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.

news18-telugu
Updated: May 5, 2020, 8:29 PM IST
రూల్స్ అతిక్రమిస్తే చర్యలు... వారికి ఏపీ డీజీపీ వార్నింగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో మద్యం అమ్మకాల సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు పాటించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మద్యం షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడంతో వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. దీనిపై ఏపీ డీజీపీ కార్యాలయం పలు సూచనలు చేసింది. మద్యం కొనుగోలుదారులు కచ్చితంగా నిబంధనల పాటించాలని కోరింది. .నిర్ణీత సమయంలోనే షాపుల వద్ద క్రమపద్దతిలో విక్రయాలు జరపాలని... మద్యం కొనుగోలుకు వచ్చే వారు ఖచ్చితంగా దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించింది.

ఖచ్చితంగా మాస్క్ ధరించడంతో పాటు మద్యం దుకాణల వద్ద గుంపులు గుంపులుగా గుమికుడరాదని స్పష్టం చేసింది. ఈ నిభందనలు అతిక్రమించిన షాపులను తక్షణమే మూసివేస్తామని హెచ్చరించింది. దీంతో పాటు మద్యం సేవించి గొడవలకు దిగడం, ఇతరులను వేధించడం, వివాదాలు సృస్టించడం, ప్రశాంతమైన వాతావరణానికి భంగం కల్పించే విధంగా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది. ఈ విధంగా వ్యహరించే వారిపై జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటివారిపై అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపింది.

First published: May 5, 2020, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading