హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అన్నీ అలాంటి కేసులే... ఫోటోలు విడుదల చేస్తామని డీజీపీ వార్నింగ్

అన్నీ అలాంటి కేసులే... ఫోటోలు విడుదల చేస్తామని డీజీపీ వార్నింగ్

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)

గుంటూరులో ఇప్పటి వరకు 8 ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పాటించి కరోనా లింక్‌ని కట్ చేయొచ్చని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో కాంటాక్ట్ కేసులే అధికంగా ఉన్నట్లు గుర్తించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చొరవ కారణంగానే ఇతర రాష్ర్టాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. గుంటూరులో ఇప్పటి వరకు 8 ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించామని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పాటించి కరోనా లింక్‌ని కట్ చేయొచ్చని సూచించారు. కరోనా వైరస్‌కి మతాలతో సంబంధాన్ని అంటగట్టిన వారి పై 47 కేసులు నమోదు చేశామని అన్నారు.

ఇక నుండి ఇటువంటి విషయాలను తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని డీజీపీ సవాంగ్ అన్నారు. ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఫొటోలను మీడియాకు విడుదల చేస్తామని హెచ్చరించారు. లాక్ డౌన్ ఎత్తివేసినా... అది విడతల వారిగానే ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయని డీజీపీ అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణలో కమ్యూనికేషన్ కీలకపాత్ర పోషిస్తుందని, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ ప్రధానమని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, అర్బన్, రూరల్ ఎస్పీలు సీహెచ్ విజయారావు, పీహెచ్ డి రామకృష్ణ, ఇతర సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Coronavirus, Gautam Sawang, Guntur

ఉత్తమ కథలు