హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మీడియా వాటిని పాటించాల్సిందే... తేల్చి చెప్పిన ఏపీ డీజీపీ

మీడియా వాటిని పాటించాల్సిందే... తేల్చి చెప్పిన ఏపీ డీజీపీ

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)

ఈ మధ్య కాలంలో మీడియాలో నియంత్రణ లేకుండా రెచ్చ గొట్టే విధంగా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో అలజడి రేగుతోందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురుణలు, ప్రసారాలు చేసేవారు, అభిప్రాయలు వ్యక్తీకరించేవారు నియంత్రణ పాటించకపోతే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ మధ్య కాలంలో మీడియాలో నియంత్రణ లేకుండా రెచ్చ గొట్టే విధంగా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో అలజడి రేగుతోందని అన్నారు. పరిస్థితులు వ్యక్తిగత దూషణల నుండి మొదలై వైషమ్యాల వైపునకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ రకమైన పోకడలను అరికట్టే క్రమంలో పోలీసు శాఖ ఈ మధ్య కాలంలో శాఖాపరమైన వ్యవస్థలను పటిష్టం చేసుకుంటోందని డీజీపీ తెలిపారు. సీఐడీ విభాగంలోని సైబర్‌ క్రైమ్‌ వింగ్‌లో సోషల్‌ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా మరో వింగ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడం, వాటి దర్యాప్తు వేగవంతం చేయడం జరుగుతూ ఉందని వివరించారు. ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పట్ల, వారి తీర్పుల పట్ల కొందరు చట్టాన్ని అతిక్రమించి వ్యాఖ్యలు చేశారన్న విషయంలో హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేశామని డీజీపీ తెలిపారు. అలాగే ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తులమీద కూడా తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు ప్రచారంచేసి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్ననిస్తున్నారని అన్నారు. వీటన్నింటిమీద పోలీసుల కన్ను ఉందని తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP DGP, Gautam Sawang

ఉత్తమ కథలు