Home /News /andhra-pradesh /

Vizag Gas Leak: వైజాగ్ ఘటనపై స్పందించిన ఏపీ డీజీపీ

Vizag Gas Leak: వైజాగ్ ఘటనపై స్పందించిన ఏపీ డీజీపీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vizag Gas Leak: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

    వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మరో ఇద్దరు ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో చనిపోయారని వెల్లడించారు. ఈ గ్యాస్‌ను ఎక్కువ మొత్తం పీల్చినవారికే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ గ్యాస్ అంత ప్రాణాంతకం కాదని.. దీని కారణంగా అనారోగ్యానికి గురైన వారంతా వెంటనే డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో పని చేసే వర్కర్స్ అంతా ఆ పరిసరాల్లోనే ఉంటారన్న డీజీపీ గౌతమ్ సవాంగ్... వారికి ఇది మరింత ప్రమాదకరమని అని అన్నారు.

    అయితే వాళ్లు ఎంత మంది ఉంటారనేది తాము కచ్చితంగా చెప్పలేమని ఏపీ డీజీపీ... ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిలో చాలామందిని కాపాడిందని అన్నారు. గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చిందని... సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించే ప్రక్రియను మరింత వేగవంతం చేశామని వివరించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి డీజీపీ సవాంగ్ విశాఖలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Gautam Sawang, Vizag gas leak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు