దేశం జాతీయ విపత్తు ఎదుర్కొంటున్న సమయంలో మొక్కవోని ధైర్యంతో పోలీసులు పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఆయనకు ఏపీలోని పోలీసులకు, వారి కుటుంబాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ బహిరంగ లేఖ రాశారు. పోలీసులకు అండగా ఉంటూ నైతిక స్థైర్యాన్ని నింపుతున్న పోలీసు కుటుంబాలకు మనస్ఫూర్తిగా డీజీపీ అభినందనలు తెలిపారు. పోలీసు కుటుంబ సభ్యులు పరోక్షంగా చేస్తున్న త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేనివని.. నిరంతరం పోలీసులు పని వత్తిడితో కుటుంబాలకు సరైన సమయాన్ని కేటాయించకపోయినా ఇంటి బాధ్యతలు చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పోలీసు కుటుంబ సభ్యులను చూసి తాను గర్వ పడుతున్నానని సవాంగ్ అన్నారు.
కొద్ది రోజుల క్రితం మన కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో నేను మీ అందరితో మాట్లాడటం జరిగిందని... మీరంతా పోలీసు ఉద్యోగం చేస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పడంతో తాను చాలా సంతోషించానని అన్నారు. ప్రజలను ఇంట్లో ఉండమని రోడ్లపై ఒంటరిగా కాపలా కాస్తున్నారని... ఒకరి వస్తువులు ఒకరు తాకలేని పరిస్థితుల్లో కనీసం తాగడానికి మంచినీరు అందుబాటులో లేకున్నా.. పని చేస్తున్నారని కొనియాడారు. ప్రతిరోజు యూనిఫామ్‌తో డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేవరకు మీ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ఎంతో మదనపడుతున్నారో నేను ఊహించగలనని అన్నారు.
ప్రతిరోజు ఆ యూనిఫాంను పరిశుభ్రంగా చేస్తూ మళ్లీ డ్యూటీ పంపిస్తున్న పోలీస్ గృహిణులకు చేతులెత్తి నమస్కరించాలని ఉందని ఒకింత భావోద్వేగానికి చేశారు. డ్యూటీ చేసిన తండ్రి ఇంటికి వచ్చేసరికి దగ్గరకు వచ్చే.. పిల్లలను కూడా దూరంగా ఉండమని చెప్పాల్సిన పరిస్థితి అయినా మా నాన్న పోలీస్ మీరంతా ఇంట్లో ఉండండి.. మా నాన్నకు సాయం చేయండి అని సామాజిక మాధ్యమాల్లో చిన్నారులు ప్రదర్శించిన తీరు చూస్తే ముచ్చటేసిందని ఏపీ డీజీపీ సవాంగ్ అన్నారు.
మీరు సమయానికి భోజనం చేసినా, చేయకున్నా.. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతున్న ఖాకీ దుస్తులలో నాకు అమ్మ కనిపిస్తుందని అన్నారు. 55 సంవత్సరాలు నిండిన వారు, కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నవారు ఈ రోడ్లపై డ్యూటీలు లేకుండా చూశామని... పోలీసు స్టేషన్లకే వారిని పరిమితం చేయాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కరోనా మహమ్మారి అంతమై చిరునవ్వులతో తిరిగి సాధారణ జీవితం ప్రారంభించాలని, అందరనీ కాపాడుకుంటామని పోలీసు కుటుంబాలు తరపున తాను మాటిస్తున్నాను.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.