ఇప్పుడు అంతా కరోనా కాలం నడుస్తోంది. వివిధ దేశాల ప్రధానులతో పాటు చాలా మంది నేతలు కరోనా టెస్టులు చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆమె కరోనా పరీక్షలు చేయించుకోవడం వెనుక కారణం వేరే ఉంది. ఏపీలో ర్యాండమ్‌గా కరోనా టెస్టులు చేసేందుకు వివిధ జిల్లాలకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు విజయనగరం జిల్లాకు చేరుకున్నాయి. 1680 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సర్కార్ ఈ జిల్లాకు పంపించింది.
దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా... విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. విజయనగరంతో పాటు శ్రీకాకుళంలోనూ కరోనా కేసులు నమోదు కాకపోవడం ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగిస్తోంది. ఇక కొద్దిరోజుల క్రితం శ్రీవాణి ఆవకాయ పచ్చడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.