అలిగిన ఏపీ ఉపముఖ్యమంత్రి... అసలు కారణం ఇదే

అమరావతిలో నిర్మించ తలపెట్టిన వెంకటేశ్వరస్వామి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సమాచారం.

news18-telugu
Updated: January 31, 2019, 12:53 PM IST
అలిగిన ఏపీ ఉపముఖ్యమంత్రి... అసలు కారణం ఇదే
ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి టీటీడీ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అమరావతిలో నిర్మించ తలపెట్టిన వెంకటేశ్వరస్వామి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడమే ఇందుకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ కృష్ణమూర్తి దేవాదాయశాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా ఆలయ అధికారులు దేవాదాయశాఖ మంత్రికి కచ్చితంగా ఆహ్వానం పంపుతుంటారు. కానీ... అమరావతిలో టీటీడీ నిర్మించనున్న ఆలయ భూకర్షణ కార్యక్రమానికి సంబంధించి కేఈ కృష్ణమూర్తికి ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇదే అంశంపై మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేఈ... టీటీడీలోని కొందరు అధికారులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానించారు. తనకు ఆహ్వానం పంపకుండా అవమానించిన టీటీడీ అధికారుల తీరుపై అసంతృప్తితో ఉన్న కేఈ... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇక రాజధాని అమరావతి నగరంలో వెంకటేశుడి ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణ పనులు గురువారం జరిగాయి. సీఎం చంద్రాబు చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు... అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరగడం శుభపరిణామమని అన్నారు. 2003లో జరిగిన అలిపిరి బాంబు దాడి ఘటన నుంచి తాను సురక్షితంగా బయటపడ్డానంటే అందుకు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులే కారణమి అన్నారు. ఆయన తనను రక్షించి ప్రాణబిక్ష పెట్టారని అన్నారు. ఆగమశాస్త్రానుసారం భూకర్షణ జరిపి పనులు ప్రారంభించాంమని... 25 ఎకరాల్లో దేవాలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.


First published: January 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>