పోలీసులకు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఫిర్యాదు...

డిప్యూటీ సీఎం హోదాలో తనకు ప్రోటోకాల్ ఉందని... ప్రతి ఒక్కటీ రికార్డు అవుతాయని అంజాద్ భాషా తెలిపారు.

news18-telugu
Updated: April 1, 2020, 3:46 PM IST
పోలీసులకు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఫిర్యాదు...
పోలీసులకు ఫిర్యాదు చేసిన అంజాద్ భాషా
  • Share this:
తనపై ఓ మీడియా సంస్థ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మండిపడ్డారు. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఢిల్లీకి వెళ్లిన మాట వాస్తవమని...కానీ ఈ నెల 2వ తేది వెళ్లి మళ్లీ 3న విజయవాడ వచ్చానని ఆయన వెల్లడించారు. డిప్యూటీ సీఎం హోదాలో తనకు ప్రోటోకాల్ ఉందని... ప్రతి ఒక్కటీ రికార్డు అవుతాయని అన్నారు. ఢిల్లీలో కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు కేసుపై వెళ్లడం జరిగిందని అంజాద్ భాషా వివరించారు. ఈ నెల 5వతేది నుండి 26 వరకు కడప లోనే ఉన్నానని... 27వ తేది విజయవాడలో క్యాబినెట్ మీటింగ్‌కు హాజరయ్యానని తెలిపారు. మళ్ళీ 28న కడప వచ్చానని అన్నారు.

ఈ నెల 14,15,16 వ తేదీలలో టీడీపీ నుండి ముఖ్య నేతలు వైసీపీ లో చేరిన కార్యక్రమంలో పాల్గొన్నట్టు అంజాద్ భాషా స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తరపున నుండి కూడా ఆ ఛానెల్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న తనపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ఒకవేళ నేను ఢిల్లీ సభలకు వెళ్లలేదు అంటే ఆ మీడియా సంస్థను మూసేస్తారా అని సవాల్ విసిరారు.
Published by: Kishore Akkaladevi
First published: April 1, 2020, 3:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading