తిరుమలలో అన్యమత ప్రచారంపై సీఎస్ ఘాటు వ్యాఖ్యలు

‘టీటీడీలో పనిచేసే వారు ఎవరైనా ఇతర మతాల వారు ఉంటే ఆ విషయం చెప్పేసి వెళ్లిపోండి. ఉద్యోగంలో వారు కొనసాగడం కుదరదు.’ అని ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టం చేశారు.

news18-telugu
Updated: August 25, 2019, 7:41 PM IST
తిరుమలలో అన్యమత ప్రచారంపై సీఎస్ ఘాటు వ్యాఖ్యలు
ఎల్ వీ సుబ్రహ్మణ్యం
  • Share this:
తిరుమలలో అన్యమత ప్రచారం అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో ఈ అంశంపై చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం స్పందించారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధమని, అన్యమతస్తులు తిరుమల నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని హెచ్చరించారు. తిరుమలలో పద్మావతి అతిథిగృహంలో టీటీడీ అధికారులో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సమావేశం అయ్యారు. ఆర్టీసీ బస్ టికెట్ల మీద అన్యమత ప్రచారానికి సంబంధించిన అంశంపై చర్చించారు. ‘తిరుమలలో బస్సు టికెట్ల మీద ఇతర మతాల ప్రచారం చాలా గర్హనీయం. ఇందులో ఆర్టీసీ నిర్లక్ష్యం కనిపిస్తోంది. వారు జాగ్రత్తగా ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇతర మతాలను వారు స్వీకరించడం వారిష్టం. టీటీడీలో పనిచేసే వారు ఎవరైనా ఇతర మతాల వారు ఉంటే ఆ విషయం చెప్పేసి వెళ్లిపోండి. ఉద్యోగంలో వారు కొనసాగడం కుదరదు. లేదా ప్రధాన బాధ్యతలు స్వీకరించడానికి కుదరదు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం శ్రేయస్కరం కాదు.’ అని ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టం చేశారు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు