హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Marriage to Daughter: తల్లిని ప్రేమించి పెళ్లాడాడు.. కుమార్తెను పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లాడు.. ఏం జరిగిందంటే?

Marriage to Daughter: తల్లిని ప్రేమించి పెళ్లాడాడు.. కుమార్తెను పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లాడు.. ఏం జరిగిందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Marriage To Daughter: కూతురుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వ్యక్తే.. పాడుబుద్ది చూపించాడు.. కన్న తల్లిని ప్రేమించి పెళ్లాడు.. తరువాత కూతురిపై మోజు పడ్డాడు. ఆమెకు మాయమాటలు చెప్పి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లాడు.. తరువాత ఏం జరిగిందంటే..?

ఇంకా చదవండి ...

Marriage To Daughter: రోజు రోజుకూ మనుషులు సమాజంలో మంచి చెడు మరిచిపోతున్నారు. వావి వరసలు వదిలేస్తున్నారు. బంధాలకు విలువ ఇవ్వడం లేదు.. అక్రమ సంబంధాల (Extramarital Affairs) కోసం ఆరాటపడుతున్నారు. తాజాగా అమానవీయ ఘటన ఒకటి సంచలనంగా మారింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ వ్యక్తి ఆ కూతురిపైనే మనసు పడ్డాడు.. ఆమెకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు.  కూతురుని తిరుపతి (Tirupati) దర్శనానికి తీసుకెళ్తున్నానని తల్లిని నమ్మించి బయటకు తీసుకెళ్లాడు.. కానీ అక్కడకు చేరుకున్న తరువాత.. భార్య  (Wife)కు ఊహించని షాక్ ఇచ్చాడు. విజయనగరం (Vizianagaram)  లో  నక్కాక లక్ష్మికి పెళ్లై.. 14 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆమెకు 17 ఏళ్ల కూమార్తె కూడా ఉంది. కేటరింగ్‌లో పని చేస్తూ కుటుంబ పోషణ చేస్తున్న సమయంలో సురేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమెకు భర్త (Husband) లేకపోవడంతో.. పెళ్లి చేసుకోవాలని నిశ్చియించుకున్నాడు. అందుకు ఇద్దరూ కూతురిని కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు వారి జీవితం సాఫీగానే సాగిందది.

కొన్ని రోజుల తరువాత భార్యపై అతడికి మోజు తీరింది. ఇంట్లో ఉన్న కుమార్తెపై మోజుపడ్డాడు. దీంతో ఆ బాలికకు మాయమాటలు చెబుతూ దగ్గరయ్యాడు. తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని ఏళ్లకే ఆమె కుమార్తెపై కన్నేశాడు. మొదటిలో ఆ బాలిక దూరం పెట్టినా.. ఆమెకు మాయ మాటలు చెప్పి.. డబ్బు ఆశ.. ఇతర ప్రలోభాలతో బాలికను దగ్గర చేసుకున్నాడు. భార్య ఇంటిలో లేని సమయంలో కూతురితో కోరికలు తీర్చుకునే వాడు. చివరికి ఆ బాలికకు మాయమాటలు చెప్పి తిరుపతి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి తల్లికి ఫోన్‌ చేసి బాలికను పెళ్లాడతానని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. చేసేది లేక ఆ తల్లి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి : రాత్రి 10 గంటలు.. వంటగదిలో భార్యను అలా చూసిన భర్త.. ఇదేంటని నిలదిస్తే

ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్‌ తిరుపతి బేరంపైన వెళ్తున్నానని.. అయితే తాను తిసుకెళ్లే కుటుంబం దగ్గర ఒక టికెట్ ఖాళీగా ఉందని.. కూతరును తనతో పాటు తీసుకెళ్తానంటూ తన భార్యను నమ్మించాడు. తిరుపతి దర్శనానికి.. అది కూడా తండ్రే కదా అని ఆమె అభ్యంతరం చెప్పలేదు.. కానీ అక్కడకు వెళ్లిన తరువాత.. మాత్రం లక్ష్మికి ఫోన్ చేసి షాక్ ఇచ్చారు ఆ తండ్రీ కూతరు..

ఇదీ చదవండి : కూతురు కంటే ఘనంగా గోవుకి సీమంతం.. 500 మందికి దంపతులను ఆహ్వానించి ఏం చేశారంటే?

అక్కడకు చేరుకోగానే తర్వాత లక్ష్మికి ఫోన్‌ చేసి తామిద్దరం.. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేమని చెప్పి.. పెళ్లి చేసుకుంటున్నామని చెప్పారు. ఆ తరువాత నుంచి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆమె వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వన్‌టౌన్‌ సీఐ మురళి కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizianagaram

ఉత్తమ కథలు