బస్సులో కరోనా బాధితురాలు ప్రయాణం.. ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేక..

బెడ్స్ ఖాళీగా లేవని, హోంక్వారంటైన్‌లో ఉండాలని చెబుతున్నారని కుమారుడికి ఫోన్ చేసి చెప్పింది ఆ మహిళ. తల్లిని ఇంటికి రప్పించేందుకు ప్రైవేట్ వాహనాల కోసం ప్రయత్నించినప్పటికీ రాత్రి వేళ ఎవరూ రాలేదు. దాంతో ఆ మహిళ రాత్రంతా ప్రభుత్వ ఆస్పత్రి వరండాలోనే పడుకుంది.


Updated: July 15, 2020, 6:27 AM IST
బస్సులో కరోనా బాధితురాలు ప్రయాణం.. ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేక..
ఏపీలో 15వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు... ఒక్క రోజులో 43 మంది మృతి...
  • Share this:
కరోనా పాజిటివ్ అని తేలితే.. ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలి. తక్కువ లక్షణాలు ఉంటే ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. కానీ ఓ కరోనా బాధితురాలు ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి.. సొంతూరుకు చేరుకుంది. కరోనా సోకిన మహిళ బస్సులో, ఆటోలో ప్రయాణించిందా? అని స్థాినకులు భయపడిపోయారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. జగ్గయ్యపేటకు చెందిన 65 ఏళ్ల మహిళకు ఇటీవల జ్వరం వచ్చింది. అనుమానంతో జులై 6న జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకుంది. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు జులై 12న ఆమెకు ఫోన్ ద్వారా ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించారు.

విజయవాడ ఆసుపత్రికి రావాలని కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 108 వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ బెడ్స్ ఖాళీగా లేవని, హోంక్వారంటైన్‌లో ఉండాలని చెబుతున్నారని కుమారుడికి ఫోన్‌చేసి చెప్పింది ఆ మహిళ. తల్లిని ఇంటికి రప్పించేందుకు ప్రైవేట్ వాహనాల కోసం ప్రయత్నించినప్పటికీ రాత్రి వేళ ఎవరూ రాలేదు. దాంతో ఆ మహిళ రాత్రంతా ప్రభుత్వ ఆస్పత్రి వరండాలోనే పడుకుంది. మంగళవారం ఉదయం ఆస్పత్రి నుంచి ఆటోలో బస్టాండ్‌కి వచ్చి.. ఆర్టీసీ బస్సులో జగ్గయ్యపేట చేరుకుంది.

కరోనా సోకిన ఆమె తిరిగి ఇంటికి రావడం.. అది కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణిచండంతో.. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తమకు కూడా కరోనా సోకుతుందేమోనని భయపడిపోయారు. ఐతే ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విషయం తమ దృష్టికి రాలేదని తహశీల్దార్ రామకృష్ణ చెప్పారు. ఎక్కడ పొరపాటు జరిగిందో విచారిస్తామని తెలిపారు. ఐతే ఆస్పత్రి సిబ్బంది వాదన మరోలా ఉంది. బెడ్స్ చూస్తున్నాం.. వేచిఉండమని చెప్పామని.. కానీ అంతలోనే ఆమె వెళ్లిపోయిందని తెలిపారు. మంగళవారం సాయంత్రం మళ్లీ విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను పంపించగా.. కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో తిరిగి ఆమెను విజయవాడ ఆస్పత్రిలో చేర్పించారు.
Published by: Shiva Kumar Addula
First published: July 15, 2020, 6:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading