Home /News /andhra-pradesh /

AP CONGRESS LEADER TULASI REDDY SERIOUS COMMENTS ON CM JAGAN MOHAN REDDY TPT SSR

Tulasi Reddy: సీఎం జగన్ ఉద్యోగులను, నిరుద్యోగులను నమ్మించి మోసం చేశాడు: తులసిరెడ్డి

కాంగ్రెస్ నేత తులసి రెడ్డి (ఫైల్ ఫొటో)

కాంగ్రెస్ నేత తులసి రెడ్డి (ఫైల్ ఫొటో)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆయన సొంత జిల్లాకు చెందిన నేత నిప్పులు చెరిగారు. ఆయన మరెవరో కాదు.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.

    కడప: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆయన సొంత జిల్లాకు చెందిన నేత నిప్పులు చెరిగారు. ఆయన మరెవరో కాదు.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసాడని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా హామీలను తుంగలో తొక్కారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా‌ను జగన్ నీరు గార్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ను 62 సంవత్సరాలకు పెంచారని, ఇప్పటికే కోచింగ్ సెంటర్‌లలో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

    ఇది కూడా చదవండి: Bhogi: తాడేపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్.. భోగి హైలైట్స్ ఇవే..

    ఉద్యోగులు మూకుమ్మడిగా వైసీపీకి ఓట్లేశారని, అధికారంలోకి వచ్చాక జగన్ వారి గొంతు కోశారని తులసిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ పే రివర్స్ కమీషన్‌గా మారిందన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 30 శాతం ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చారని తులసిరెడ్డి చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో టీడీపీ తోట చంద్రయ్యను వైసీపీ నేతలు దారుణంగా హత్య చేశారని, రాష్ట్రంలో రాక్షస రాజ్యం, రౌడీ రాజ్యం నడుస్తుందన్నారు. హత్యా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

    ఇది కూడా చదవండి: AP Politics: పల్నాడులో భగ్గుమన్న హత్యా రాజకీయాలు.., వైసీపీని ఇరుకునపెట్టే పనిలో టీడీపీ..

    సంపూర్ణ గృహ హక్కు పథకం కింద పేదలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ స్వచ్ఛందం అంటూనే మరో పక్క వైసీపీ ప్రభుత్వం బలవంతం చేయడం భావ్యం కాదని ఆయన హితవు పలికారు. ఇళ్ల హక్కు సాకు చూపి పేదల నుంచి రూ.5 వేల కోట్ల వరకూ దోచుకునేందుకే ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని తులసిరెడ్డి దుయ్యబట్టారు. నవరత్నం అంటూ జగన్ ప్రభుత్వం ఊదరగొట్టిందని.. ఇప్పుడది నకిలీ రత్నంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి నిజంగా చిత్త శుద్ధి ఉంటే పేదలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసే పద్ధతి ఇది కాదన్నారు. పేదలపై అంత ప్రేమ వైసీపీ సర్కార్‌కు ఉంటే పేదలకు ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన సూచించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: AP Congress, Cm jagan, Kadapa

    తదుపరి వార్తలు