హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Coastal Area: ఏపీ కోస్తా తీరానికి కోత ముప్పు.. షాకింగ్ విషయాలు చెప్పిన కేంద్రం

AP Coastal Area: ఏపీ కోస్తా తీరానికి కోత ముప్పు.. షాకింగ్ విషయాలు చెప్పిన కేంద్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కు సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. శ్రీకాకుళం (Srikakulam) నుంచి తిరుపతి జిల్లా (Tirupati) వరకు ఉన్న ఏపీ కోస్తా తీరం.. రాష్ట్ర అభివృద్ధికి కీలకం. పోర్టులతో పాటు మత్స్యకారులకు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు తీరప్రాంతం కీలకం. అలాగే పర్యాటకంగా మరింత ముఖ్యమైనది. ఐతే ఏపీలోని కోస్తా తీరంపై కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిజాలు వెల్లడించింది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కు సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. శ్రీకాకుళం (Srikakulam) నుంచి తిరుపతి జిల్లా (Tirupati) వరకు ఉన్న ఏపీ కోస్తా తీరం.. రాష్ట్ర అభివృద్ధికి కీలకం. పోర్టులతో పాటు మత్స్యకారులకు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు తీరప్రాంతం కీలకం. అలాగే పర్యాటకంగా మరింత ముఖ్యమైనది. ఐతే ఏపీలోని కోస్తా తీరంపై కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిజాలు వెల్లడించింది. ఏపీలో తీవ్ర కోత ముప్పు ఎదుర్కొంటున్న తీర ప్రాంతం 20 శాతం పైనే ఉన్నట్లుగా ఇంకాయిస్‌ (ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సర్వీసెస్‌) అధ్యయనంలో తేలినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు. రాజ్యసభ (Rajyasabha) లో వైఎస్సార్సీపీ (YSRCP) ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

  రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఓ మోస్తరు కోత ముప్పు ఉన్నట్లుగా ఇన్‌కాయిస్‌ అధ్యయనం పేర్కొనట్లు తెలిపారు. కోత ముప్పు అతి తీవ్రస్థాయిలో ఉన్న ప్రాంతం 0.55 శాతం ఉన్నట్లు మంత్రి చెప్పారు. సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్)కి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. దీనికి అదనంగా తీరప్రాంత కోత వలన నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరో వేయి కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు.

  ఇది చదవండి: నేటి నుంచి సీఎం జగన్ కొత్త మిషన్.. చంద్రబాబు నియోజకవర్గం నుంచే మొదలు..


  జాతీయ స్థాయిలో నేషనల్ డిసాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ సంస్థను నెలకొల్పి 2021-22 నుంచి 2025-26 కాలానికి ఈ సంస్థకు 68 వేల 463 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధిని ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఎంఎఫ్‌ సంస్థలకు 80-20 నిష్పత్తిలో విభజించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఎన్‌డీఎంఎఫ్‌ను నెలకొల్పింది. ఇలాంటి సంస్థలనే ఎస్‌డీఎంఎఫ్‌ పేరిట ఏర్పాటు చేయవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సలహా మేరకు ఇప్పటికి 21 రాష్ట్రాలు ఎస్‌డీఎంఎఫ్‌లను ఏర్పాటు చేశాయని మంత్రి వివరించారు. సముద్ర కోతల వలన తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందిస్తూ సాంకేతికపరమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయని ఆయన చెప్పారు.

  కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కోస్తా జిల్లాల్లో కాస్త ఆందోళన  మొదలైంది. ఇప్పటికే తుఫాన్లు, భారీ వర్షాలతో నిత్యం ముప్పు ముంగిట ఉంటున్న జిల్లాలకు ఇప్పుడు కోస్తా తీరం కోతకు గురవుతుందంటే తగ్గర్లోని గ్రామాలు కనుమరుగవుతాయా..? అనే చర్చ జరుగుతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Bay of Bengal

  ఉత్తమ కథలు