మృత్యువుతో పోరాడుతున్న బాలుడికి ‘ప్రాణదానం’ చేసిన సీఎం జగన్

కృష్ణా జిల్లా పెడనలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న ఓ బాలుడికి తగిన ఆర్థిక సాయం చేసి సీఎం‌ జగన్‌ తన మానవత్వాన్ని చాటుకున్నారు.

news18-telugu
Updated: September 5, 2020, 2:57 PM IST
మృత్యువుతో పోరాడుతున్న బాలుడికి ‘ప్రాణదానం’ చేసిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
సీఎం జగన్‌ ఏపీలో వైద్యానికి పెద్దపీటవేసి ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. తాజాగా... కిడ్నీ వ్యాధితో ప్రాణపాయకర పరిస్థితుల్లో ఉన్న ఓ బాలుడికి తక్షణసాయం కింద ఆర్థిక సాయం అందించారు. కృష్ణా జిల్లా పెడనలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న ఓ బాలుడికి తగిన ఆర్థిక సాయం చేసి సీఎం‌ జగన్‌ తన మానవత్వాన్ని చాటుకున్నారు. పెడన పట్టణం 7వ వార్డుకు చెందిన వాసా కుమార స్వామి, మధులత దంపతుల కుమారుడు రేవంత్‌ కుమార్‌ గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌ లోని యశోద ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నాడు. పట్టణ వైసీపీ నాయకుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న జోగి రమేష్‌.. సీఎం కార్యాలయ వైద్య విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అధికారులు ఆ బాలుడికి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం యశోద ఆసుపత్రికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక లేఖను ఎమ్మెల్యే జోగి రమేష్‌ శుక్రవారం ఆ బాలుడి కుటుంబానికి అందజేశారు.

cm convoy, ys jagan, ap cm jagan, ap news, ambulance convoy, telugu news, telugu varthalu, సీఎం జగన్, సీఎం కాన్వాయ్, అంబులెన్స్, తెలుగు వార్తలు,
వైఎస్ జగన్ మంచి నిర్ణయం... అంబులెన్స్‌కి దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్


మూడో రోజుల క్రితం సెప్టెంబర్ 2న కూడా జగన్ ఇలాగే తన మానవత్వాన్ని చాటుకున్నారు. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్... ఓ అంబులెన్స్‌కి ప్రత్యేకంగా దారిఇచ్చింది. జనరల్‌గా సీఎం కాన్వాయ్ రోడ్డుపై వెళ్తుంటే... ఇతర వాహనాలన్నింటినీ ఆపేస్తుంటారు పోలీసులు. కానీ... అది అంబులెన్స్ కావడంతో... సీఎం కాన్వాయే దానికి అడ్డుతొలగి దారి ఇచ్చింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా... పులివెందులకు వెళ్లి... నివాళులు అర్పించిన వైఎస్ జగన్... అక్కడి నుంచి తిరిగివచ్చి... గన్నవరం విమానాశ్రయం చేరారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి బయల్దేరారు. గూడవల్లి - నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌ కూతపెట్టింది. అది గమనించిన సీఎం జగన్... కాన్వాయ్‌లో వాహనాలన్నీ పక్కకు పంపి... అంబులెన్స్‌కి దారి ఇచ్చేయమన్నారు. అంతే... ఒక్కసారిగా... రోడ్డుపై సగ భాగం పూర్తిగా దారి ఏర్పడింది. దాంతో... ఎలాంటి బ్రేకూ వెయ్యకుండా అంబులెన్స్ వేగంగా వెళ్లిపోయింది.

ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పై వెళ్తున్న చాపర్తిన శేఖర్‌... ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ దగ్గర్లో ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 5, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading