Home /News /andhra-pradesh /

AP CM YS JAGANMOHAN REDDY FINANCIAL HELP TO GUNTUR BODY BUILDER BA GNT

గుంటూరు యువకుడికి రూ.9 లక్షల సాయం చేసిన సీఎం జగన్.. ఎందుకంటే..

ముఖ్యమంత్రిని కలిసిన రవికుమార్

ముఖ్యమంత్రిని కలిసిన రవికుమార్

ప్రపంచ స్థాయి దేహదారుఢ్య పరీక్షల్లో పసిడి పతకం సాధిస్తానని ఈ సందర్భంగా బాడీ బిల్డర్ రవి పేర్కొన్నారు. అండగా నిలిచిన ముఖ్యమంత్రి, మంత్రి మేకపాటి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఆర్జాస్ స్టీల్ కంపెనీకి బాడీబిల్డర్ రవి కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా చదవండి ...
    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిశ్శంకరరావు రవికుమార్ అనే బాడీ బిల్డర్ కు ప్రభుత్వం తరపున ఆర్థిక అండదండలు లభించాయి. నాలుగు నెలల క్రితం హోం మంత్రి మేకతోటి సుచరిత స్వగ్రామానికి చెందిన రవి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రపంచ స్థాయి దేహదారుఢ్య పోటీలకు సన్నద్ధమయ్యేందుకు కావలసిన ఆర్థిక సాయాన్ని అందించమంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే తన కేబినెట్ మంత్రులలో దేహధారుడ్యంపై ఆసక్తి కలిగిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి అప్పటికే అక్కడ ఉండడంతో సీఎం ఆ బాధ్యత మంత్రి మేకపాటికి అప్పగించారు. గుంటూరుకు చెందిన బాడీ బిల్డర్ రవికుమార్ గత సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన ముఖ్యమంత్రిని కలిశారు. రవికుమార్ ఆ మరుసటి రోజునే సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో సమావేశమయ్యారు. 2015 నుంచి ఇలాంటి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పురస్కారాలు అందుకున్నారు రవికుమార్. 2018లో పుణెలో జరిగిన అంతర్జాతీయ స్థాయి (75కేజీలు) ఆసియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించినట్లు మంత్రి మేకపాటికి వెల్లడించారు.

    సీఎం ఆదేశాల ప్రకారం సీఎస్ఆర్ నిధుల ద్వారా ఆర్జాస్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రవికి అవసరమైన సాయానికి పరిశ్రమల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి నెలా రూ.70వేల చొప్పున సంవత్సరంలోగా రూ. 7లక్షల ఆర్థిక సాయం అందనుంది. అంతేకాకుండా, నవంబరులో దక్షిణ కొరియాలో జరగబోయే పోటీలకు కావలసిన ప్రయాణ ఖర్చు సహా కనీస వసతులను మరో రూ. 2లక్షలుగా 'ఆర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్' అందించనుంది. సామాజిక బాధ్యతలో భాగస్వామ్యమైన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ సంస్థ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అభినందించారు. గతంలోనూ ఎన్నో మంచి పనులకు సీఎస్ఆర్ నిధులు ఇచ్చి ప్రోత్సాహించిన ఆర్జాస్ స్టీల్ మళ్ళీ సాయానికి ముందుకు రావడాన్ని మంత్రి కొనియాడారు. పరిశ్రమల శాఖను, ముఖ్యంగా డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది చొరవను కూడా మంత్రి గౌతమ్ రెడ్డి మెచ్చుకున్నారు. పోటీలకు సన్నద్ధమవుతున్న రవికి మంత్రి పలు సంస్థల ద్వారా బ్రాండింగ్ కూడా అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

    ప్రపంచ స్థాయి దేహదారుఢ్య పరీక్షల్లో పసిడి పతకం సాధిస్తానని ఈ సందర్భంగా బాడీ బిల్డర్ రవి పేర్కొన్నారు. అండగా నిలిచిన ముఖ్యమంత్రి, మంత్రి మేకపాటి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఆర్జాస్ స్టీల్ కంపెనీకి బాడీబిల్డర్ రవి కృతజ్ఞతలు తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Guntur

    తదుపరి వార్తలు