Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN WENT TO DAVOS TO ATTEND WORLD ECONOMIC FORUM 2022 FULL DETAILS HERE PRN

CM Jagan Davos Tour: దావోస్ బయలుదేరిన సీఎం జగన్.. 10 రోజులు అక్కడే.. షెడ్యూల్ ఇదే..!

దావోస్ బయలుదేరిన సీఎం జగన్

దావోస్ బయలుదేరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) విదేశీ పర్యటనకు బయలుదేరారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ (Davos-2022) నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు (World Economic Forum-2022) కు హాజరుకానున్నారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) విదేశీ పర్యటనకు బయలుదేరారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ (Davos-2022) నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు (World Economic Forum-2022) కు హాజరుకానున్నారు. శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం జగన్ నేరుగా జ్యూరిచ్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఈ రాత్రికి 8.30 గంటలకు దావోస్ చేరుకుంటారు. 10 రోజుల పాటు సీఎం ఫారిన్ టూర్ లోనే ఉండనున్నారు. ఈనెల 31వ తేదీన సీఎం తిరిగి ఏపీకి చేరుకునే అవకాశముంది. సీఎం జగన్ వెంట ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy), పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Minister Gudivada Amarnath), ఎంపీ పీవీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy), ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఆర్ధిక, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

    ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 22 నుంచి 26వరకు స్విట్డర్లాండ్ (Switzerland) లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు జగన్ నేతృత్వంలోని బృందం హాజరుకానుంది. రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఉండబోతోంది. ఈ సదస్సులో సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కి పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు సదస్సుకు హాజరవుతున్నారు. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకోనుంది.

    ధావోస్ లో ఏపీ పెవిలియన్

    ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి డెడ్ బాడీ.. అసలేం జరిగింది..


    దావోస్ పర్యటనలో సీఎం జగన్ ప్రధానంగా 3 కీలక సమావేశాలలో భాగస్వామ్యం కానున్నారు. 23న తేదీన వైద్యరంగంపై కీలక సమావేశం నిర్వహిస్తారు. 24వ తేదీన విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. 24వ తేదీన డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశంలో పాల్గొంటారు. “ప్రజలు , పురోగతి , అవకాశాలు” అనే నేపథ్యంతో ప్రపంచ వేదికగా ఏపీలో ఉన్న అపార అవకాశాలను చాటేందుకు దావోస్ పర్యనకు వెళ్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవలే సీఎం జగన్ దావోస్ వెళ్లేందుకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. దీంతో జగన్ టూర్ కు లైన్ క్లియర్ అయింది. సీఎం అయన మూడేళ్ల తర్వాత తొలిసారి పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎలాంటి సంస్థలను తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు