సీఎం జగన్ అమెరికా పర్యటన...వారం పాటు అక్కడే...షెడ్యూల్ ఇదే

మొత్తం వారం రోజుల పర్యటనలో మూడు రోజులను వ్యక్తిగత పనులకే కేటాయించారు జగన్. ఐతే ఆ మూడు రోజులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వ ఖాతాలో వేయకుండా తానే భరించనున్నారు.

news18-telugu
Updated: August 15, 2019, 10:29 PM IST
సీఎం జగన్ అమెరికా పర్యటన...వారం పాటు అక్కడే...షెడ్యూల్ ఇదే
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం అమెరికాకు వెళ్లనున్నారు. ఆగస్టు 16 నుంచి 22 వరకు వారం రోజుల పాటు యూఎస్‌లో ఆయన పర్యటించనున్నారు. ఆగస్టు 16న వాషింగ్టన్ డీసీ, 17న డల్లాస్, 18,19 తేదీల్లో వాషింగ్టన్ డీసీ, 21, 22 తేదీల్లో షికాగోలో పర్యటించనున్న ఏపీ సీఎం. వారం రోజుల పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థ ప్రతినిధులు, దౌత్యాధికారులతో చర్చించున్నారు. అనంతరం ఆగస్టు 22న యూఎస్ నుంచి తిరిగి ఏపీకి బయల్దేరనున్నారు వైఎస్ జగన్.

జగన్ అమెరికా టూర్ షెడ్యూల్ ఇదే (అమెరికా కాలమానం ప్రకారం):
• ఆగస్టు 16  ఉదయం 8:30 గంటలకు జగన్ వాషింగ్టన్ డీసీ చేరనున్నారు. అదేరోజు అమెరికా రాయబారితో సమావేశం కానున్నారు. అనంతరం అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఇక సాయంత్రం అమెరికాలో భారత్ రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొననున్నారు.

• ఆగస్టు 17 మధ్యాహ్నం 2గంటలకు జగన్ డల్లాస్ చేరుకోనున్నారు. సాయంత్రం 6 నుంచి 7:30 గంటల వరకు కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీని కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగించనున్నారు.
• ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు.


• ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనులపై సీఎం వెళ్లనున్నారు.
• ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను సీఎం జగన్ కలుస్తారు.• ఆగస్టు 22న రాత్రి 8:30 గంటలకు ఏపీకి బయల్దేరుతారు.

మొత్తం వారం రోజుల పర్యటనలో మూడు రోజులను వ్యక్తిగత పనులకే కేటాయించారు జగన్. ఐతే ఆ మూడు రోజులకు అయ్యే ఖర్చులను.. ప్రభుత్వ ఖాతాలో వేయకుండా తానే భరించనున్నారు.
First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు